Windows 11 Set to Warn Users If Their PC
Shouldn’t Be Running the OS
విండోస్ 11
యూజర్లకు మైక్రోసాఫ్ట్ నోటిఫికేషన్ ద్వారా హెచ్చరిక – వివరాలు
ఇవే
గత ఆపరేటింగ్ సిస్టమ్ లకు భిన్నంగా మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11ను పరిచయం చేసింది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో కొత్త ఓఎస్‌ను అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ ఓఎస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఇందులో యాప్ ఐకాన్స్, ఆండ్రాయిడ్ యాప్ సపోర్ట్, మల్టీ టాస్కింగ్ లేవుట్స్, ఆటో అప్‌డేట్, గేమర్స్ కోసం ఆటో హెచ్‌డీఆర్ వంటి ఎన్నో రకాల ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే ఈ ఓఎస్ పనిచేసేందుకు యూజర్స్ పీసీ/కంప్యూటర్లలో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లుండాలనే షరతు విధించింది. దీని వల్ల విండోస్ 11 వినియోగం యూజర్‌కు కొత్త అనుభూతిని ఇస్తుందని మైక్రోసాఫ్ట్ చెప్పింది. అయితే మైక్రోసాఫ్ట్ సూచించిన ఫీచర్లు లేని పీసీ/కంప్యూటర్లలో కూడా విండోస్ 11ను చాలా మంది ఇన్‌స్టాల్ చేశారు.
తొలినాళ్లలో దీనిపై ఎక్కువగా దృష్టి సారించని మైక్రోసాఫ్ట్, తాజాగా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. మైక్రోసాఫ్ట్ సూచించిన కనీస ఫీచర్లు లేకుండా విండోస్ 11ను ఉపయోగించే యూజర్లకు డెస్క్‌టాప్ నోటిఫికేషన్ ద్వారా హెచ్చరిక జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘‘విండోస్ 11తో పనిచేసేందుకు మీ సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ సరిపోవు’’ అనే లైన్ యూజర్‌కు కనిపించనుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విండోస్ 11 కోసం కంప్యూటర్‌లో ఎలాంటి ఫీచర్లుండాలనేది యూజర్ పక్కనే ఉన్న ‘లెర్న్ మోర్’ లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ త్వరలోనే దీన్ని ఆచరణలోకి తీసుకురానుంది.
ఒకవేళ యూజర్లు ఎక్కువ కాలంపాటు తమ
కంప్యూటర్ ఫీచర్లు అప్‌గ్రేడ్ చేయకుండా విండోస్ 11ను
ఉపయోగించాలనుకుంటే, భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విడుదల చేసే
ఓఎస్ అప్‌డేట్‌లు సదరు కంప్యూటర్లలో పనిచేయవని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దానివల్ల
భవిష్యత్తులో జరిగే సైబర్ దాడుల నుంచి యూజర్ డేటాకు ఎలాంటి రక్షణా ఉండదని కంపెనీ
పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సూచించిన దాని ప్రకారం విండోస్ 11
ఓఎస్ ఇన్‌స్టాల్/అప్‌డేట్ చేసుకోవాలంటే సిస్టమ్ 64 బిట్
అయి ఉండాలి. 1 జీహెచ్‌జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో
పనిచేస్తుండాలి. కనీసం 4జీబీ ర్యామ్, 64 జీబీ ఫ్రీ స్టోరేజీ ఉండాలి
0 Komentar