64 Years Old Man Got 140
Rank In Gate-2022
ఉన్నత చదువులకు వయసు అడ్డుకాదు: వయసు
64.. గేట్‌లో 140వ ర్యాంక్
అనంతపురంలో రిటైర్డ్ ఉద్యోగి ఘనత
ఉద్యోగం చేస్తూ కూడా చదివేవారు
ఎందరో. కానీ, ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేవారు
అరుదు. అనంతపురం నగరానికి చెందిన వి.సత్యనారాయణరెడ్డి ఇంజినీరుగా ఉద్యోగ విరమణ
చేసిన తరువాత జేఎన్‌టీయూలో ఎంటెక్ చేశారు. గేట్ పరీక్షలో జాతీయస్థాయిలో 140వ
ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లు
పనిచేశారు. డీఈఈగా 2018లో ఉద్యోగ విరమణ చేశారు.
2019లో జేఎన్‌టీయూ సివిల్ విభాగంలో ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్ పరీక్షలోని జియోమోటిక్స్ ఇంజినీరింగ్ పేపరులో 140వ ర్యాంకు సాధించారు. ఆయన వయసు ప్రస్తుతం 64 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేట్ సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యలో ప్రవేశానికి 3 సంవత్సరాలపాటు అవకాశం ఉంటుందని, కుటుంబసభ్యులతో చర్చించి బాంబే లేదా రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు వివరించారు.
0 Komentar