Amazon ‘Fab Phones and TV Fest’ and Flipkart
‘Big Saving Days’ Sale – Details Here
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
సేల్: ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’, ‘ఫ్యాబ్
టీవీ ఫెస్ట్ ’ మరియు ‘బిగ్ సేవింగ్స్ డేస్’ సేల్స్ – వివరాలు ఇవే
ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
మరో సేల్‌తో ముందుకొచ్చాయి. ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’, ‘ఫ్యాబ్
టీవీ ఫెస్ట్’ పేరిట అమెజాన్ ఆఫర్లను ప్రకటించగా.. ‘బిగ్ సేవింగ్స్ డేస్’
పేరిట ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లను ప్రకటించింది.
అమెజాన్ సేల్: మార్చి 11 నుంచి మార్చి 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో
స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై అమెజాన్ డిస్కౌంట్లు అందిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు, బ్యాంక్ ఆఫ్ బరోడా
క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ
కార్డులపై నో కాస్ట్ ఈఎంఐతో మీ పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే సదుపాయమూ
కల్పిస్తోంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో పాటు పవర్
బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్‌పై ఆఫర్లను అందిస్తోంది. వన్‌ప్లస్,
శాంసంగ్, రియల్‌మీ మొబైల్స్‌తో పాటు వివిధ
కంపెనీల టీవీలపైనా ఆఫర్లు నడుస్తున్నాయి.
================
ఫ్లిప్‌కార్ట్ సేల్: మార్చి 12 నుంచి మార్చి 16 వరకు అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్
ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో
పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనా డిస్కౌంట్లు అందిస్తున్నారు. యాపిల్,
శాంసంగ్, ఒప్పో, రియల్‌మీ
వంటి స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ఇస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా
కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు ఉంటుంది. ఈఎంఐ
లావాదేవీలకు డిస్కౌంట్ వర్తిస్తుంది.
0 Komentar