AP Budget 2022: శాసనసభలో
బడ్జెట్ కేటాయింపు లోని ముఖ్యాంశాలు ఇవే
ఏపీ శాసనసభలో 2022-23 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. దీనిలో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు అంచనా రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా పేర్కొన్నారు.
బడ్జెట్ కేటాయింపులివే..
▶ వ్యవసాయ
రంగానికి రూ.11,387కోట్లు
▶ బీసీ
సంక్షేమానికి రూ.20,962 కోట్లు
▶ ఉన్నత
విద్యకు రూ.2,014కోట్లు
▶ పశుసంవర్థకశాఖకు
రూ.1,568కోట్లు
▶ పర్యావరణ-అటవీశాఖకు రూ.685 కోట్లు
▶ విద్యుత్
రంగానికి రూ.10,281 కోట్లు
▶ ఆర్థికంగా
వెనుకబడిన వర్గాలకు రూ.10,201 కోట్లు
▶ పౌరసరఫరాల
శాఖకు రూ.3,719 కోట్లు
▶ వ్యవసాయ మార్కెటింగ్,
సహకార శాఖకు రూ.11,387కోట్లు
▶ సైన్స్ అండ్ టెక్నాలజీ
రంగానికి రూ.685 కోట్లు
▶ రవాణా
రంగానికి రూ.9,617 కోట్లు
▶ ఎస్సీ
సబ్‌ప్లాన్‌కు రూ.18,518 కోట్లు
▶ ఎస్టీ
సబ్‌ప్లాన్‌కు రూ.6,145 కోట్లు
▶ బీసీ
సబ్ ప్లాన్‌కు రూ. 29,143 కోట్లు
▶ ఎంఎస్‌ఎంఈలకు
రూ.450 కోట్లు
▶ విశాఖపట్నం-చెన్నై
ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.236కోట్లు
▶ ఎస్సీ
పారిశ్రామిక వేత్తల ఇన్సెంటివ్‌లకు రూ.175 కోట్లు
▶ గ్రామీణాభివృద్ధికి
రూ.17,109 కోట్లు
▶ కొత్త
వైద్యకళాశాలలు, ఆస్పత్రులకు రూ.320
కోట్లు
▶ వైఎస్‌ఆర్
ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు
▶ 104 సర్వీసులకు రూ.140కోట్లు, 108
సర్వీసులకు రూ.133 కోట్లు
▶ ఆస్పత్రుల్లో
నాడు-నేడుకు రూ.500 కోట్లు
▶ ఆశా
వర్కర్ల గౌరవ వేతనాలకు రూ.343 కోట్లు
▶ రేషన్
బియ్యం కోసం రూ.3,100 కోట్లు.. బియ్యం డోర్ డెలివరీకి రూ.200 కోట్లు
▶ అంగన్వాడీ
కోసం రూ.1,517 కోట్లు.. అంగన్వాడీ కేంద్రాల్లో
పౌష్టికాహారానికి రూ.1200 కోట్లు.
▶ గ్రామీణ
తాగునీటి సరఫరాకు 1,149 కోట్లు
▶ నియోజకవర్గాల
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి రూ.350 కోట్లు
0 Komentar