AP: Formation of New-Districts in AP on
This Date
ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు
ముహూర్తం ఖరారు - కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా
అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4న ఉదయం 9.05 నుంచి 9.45 మధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు
చేయనున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్
అధ్యక్షతన ఈ ఉదయం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి
వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై
అధికారులతో జగన్ చర్చించారు. పలు జిల్లాలు, జిల్లా కేంద్రాల
పేర్లు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా చర్చ
జరిగింది.
26 జిల్లాల ఏర్పాటునకు గానూ
వర్చువల్‌గా ఆమోదం తెలిపింది కేబినెట్. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,
రాజమండ్రి, నరసాపురం, బాపట్ల,
నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య,
నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్
విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి.
పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.
0 Komentar