AP: ఇంటర్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్
విధానాన్ని సస్పెండ్ చేసిన హైకోర్టు -
ఇంటర్ విద్యార్థులు వారు
చదువుతున్న కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు స్పష్టం
చేసింది. ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర
ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది.
ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని తీసుకొస్తూ ఇంటర్ బోర్డు తీసుకున్న
నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ఒకే కళాశాలలో చదువుతున్న
విద్యార్థులు వేర్వేరు కళాశాల్లో ప్రాక్రికల్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని
న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వం
ఇచ్చిన నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది. దీంతో పాత విధానంలోనే ప్రాక్టికల్
పరీక్షలు జరిగే అవకాశముంది.
ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
రేపటి (శుక్రవారం) నుంచి జరగాల్సిన
ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు దృష్ట్యా
షెడ్యూలు మారుతున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డ్ పేర్కొంది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్
ప్రాంతీయ అధికారులందరికీ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే కోర్టు ఆదేశాల
ప్రకారం షెడ్యూలు ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.
=============
CIRCULAR ON PRACTICALS POSTPONEMENT 10-03-2022
=============
AP Inter Practical Hall Tickets March
2022 (Previous Post on Hall Tickets) 👇
0 Komentar