AP: Suppression of (4764) vacant post of
SGTs existing in the Cadre strength
ఏపి: రాష్ట్రంలో 4,764 ఎస్‌జిటి పోస్టుల రద్దు చేస్తూ వాటిని మోడల్ స్కూల్స్ కు బదలాయిస్తూ
ఉత్తర్వులు విడుదల
Public Services – School Education
Department – Suppression of (4764) vacant post of Secondary Grade Teachers
existing in the Cadre strength of Director of School Education Department –
Orders – Issued
G.O.MS.No37, Dated: 24.03.2022
రాష్ట్రవ్యాప్తంగా 4,764 సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జిటి) పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసం వీటిని విలీనం చేస్తున్నట్లు
ఉత్తర్వుల్లో పేర్కొంది.
కర్నూలు మినహా 12
జిల్లాల్లోనూ 397 పోస్టుల చొప్పున రద్దు చేసింది. 2018లో ఆంగ్ల మాధ్యమంతో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు. వీటికి 163 మంది ప్రిన్సిపాళ్లు, 1956 మంది పోస్టు
గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 1,141 మంది ట్రైన్డ్
గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ) పోస్టులను మంజూరు చేసింది. వీటిలో పని చేస్తున్న
ఉపాధ్యాయులకు ఇప్పటిదాకా సర్వీసు నిబంధనలు లేవు. దీంతో పీఎఫ్, ఆరోగ్యకార్డుల వంటి సదుపాయాలు లభించడం లేదు. సర్వీసు నిబంధనల కోసం పాఠశాల
విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల
సొసైటీ విధానంలో సర్వీసు నిబంధనల కోసం ప్రతిపాదించింది. ఆదర్శ పాఠశాలల్లోని మొత్తం
3,260
పోస్టులకు సర్వీసు నిబంధనలను కల్పించేందుకు ఇప్పటికే ఉన్న 4,764
పోస్టుల విలీనాన్ని ప్రతిపాదించారు. దీంతో 4 వేలకు
పైగా పోస్టులను రద్దు చేశారు.
0 Komentar