APSRTC: Restoration of 25% Concession in
fare to Senior Citizens travelling in APSRTC Buses w.e.f. 01-04-2022
ఆర్.టి.సి బస్సులు ప్రయాణించే సీనియర్
సిటిజన్లకు ఛార్జీ లో 25% రాయితీ ఏప్రిల్ -1వ తేదీ నుంచి అమలు గురించి ఉత్తర్వులు జారీ
ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్స్ కు 25% పునరుద్ధరణ రాయితీ
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేసే
60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల కు కల్పిస్తున్న 25 శాతం రాయితీని ఏప్రిల్ 1వ
తేదీ నుంచి పునరుద్ధరిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్)
ఉత్తర్వులిచ్చారు. కోవిడ్ నేపథ్యంలో ప్రయాణాలను నియంత్రించే లక్ష్యంతో 2020 మే 21వ
తేదీ నుంచి ఈ రాయితీని నిలిపేశారు.
ప్రస్తుతం కోవిడ్ అదుపులోకి రావడం
పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి చేరాయి. దీంతో మళ్లీ రాయితీని పునరుద్ధరించారు.
ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్
కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు,
రేషన్ కార్డు ఇలా ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ఏసీ సర్వీసు లతో
సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీల్లో ఈ రాయితీని పొందొచ్చు.
0 Komentar