Axis Bank Hikes FD Interest Rates for
This Tenure – Details Here
ఎఫ్‌డీలపై వడ్డీరేటును పెంచిన
యాక్సిస్ బ్యాంక్ - వివరాలు ఇవే
యాక్సిస్ బ్యాంక్ మరోసారి ఫిక్స్‌డ్
డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అయితే, ఈ సారి ఏడాది 11 రోజులు ఆ పైన, ఏడాది 25
రోజుల లోపు కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మాత్రమే వడ్డీరేటును
పెంచుతున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు ఈ కాలవ్యవధి గల డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా, తాజాగా వడ్డీ
రేటును 5 బేసిస్ పాయింట్ల మేర పెంచి 5.30 శాతం చేసింది. సవరించిన వడ్డీ రేటు మార్చి 21
నుంచి వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. మిగిలిన కాలపరిమితులకు ఇంతకు
ముందున్న వడ్డీ రేట్లే వర్తిస్తాయని తెలిపింది. యాక్సిస్ బ్యాంక్ చివరిసారిగా
మార్చి 17న వడ్డీ రేట్లను సవరించింది.
బ్యాంక్ సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనపు వడ్డీ ఆఫర్ చేస్తుంది. ఇది అన్ని కాలపరిమితులకు వర్తిస్తుంది. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుంచి మొదలుకుని 10 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితులతో ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తుంది. అత్యధికంగా 5 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీపై 5.75 శాతం వడ్డీని అందిస్తుంది.
రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్
డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ సాధారణ ప్రజలకు ఆఫర్ చేస్తున్న వడ్డీ
రేట్లు..
* 7 - 29 రోజుల డిపాజిట్లపై
... 2.50 శాతం
* 1 - 3 నెలల డిపాజిట్లపై
... 3 శాతం
* 3 - 6 నెలల డిపాజిట్లపై...
3.50 శాతం
* 6 - 12 నెలల డిపాజిట్లపై
... 4.40 శాతం
* ఏడాది పైన, ఏడాది 5 రోజుల లోపు డిపాజిట్లపై ... 5.10 శాతం
* ఏడాది 5 రోజుల పైన, ఏడాది 11 రోజుల
లోపు ... 5.15 శాతం
* ఏడాది 11 రోజుల పైన, ఏడాది 25 రోజుల
లోపు ... 5.30 శాతం
* ఏడాది 25 రోజుల పైన, 15 నెలల లోపు ... 5.15 శాతం
* 15 నెలలు ఆపైన 18 నెలల లోపు డిపాజిట్లపై .5.20 శాతం
* 18 నెలలు ఆపైనా 2 ఏళ్ల లోపు. 5.25 శాతం
* 2ఏళ్ల నుంచి 3 ఏళ్ళ లోపు డిపాజిట్లపై. 5.40 శాతం
* 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేట్లను
బ్యాంక్ ఆఫర్ చేస్తుంది.
0 Komentar