BITSAT- 2022 Notification Released -
Registration Started, Eligibility, and Exam Pattern Details Here
బిట్ శాట్ - 2022 నోటిఫికేషన్ విడుదల - అర్హత, పరీక్షా విధానం మరియు ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే
పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్
ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) 2022-2023 విద్యా
సంవత్సరానికి బిట్ శాట్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ద్వారా బిట్స్ పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా
క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్ లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ
ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్ శాట్) 2022
క్యాంపస్లు అందిస్తున్న కోర్సులు:
1) బిట్స్, పిలానీ - పిలానీ క్యాంపస్
బీఈ: కెమికల్, సివిల్,
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్టుమెంటేషన్,
మెకానికల్ తదితరాలు
బీఫార్మా:
ఎమ్మెస్సీ: బయలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ,
ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ జనరల్ స్టడీస్.
2) బిట్స్, పిలానీ - కేకే బిర్లా గోవా క్యాంపస్
బీఈ: కెమికల్, సివిల్,
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్,
మెకానికల్ తదితరాలు.
ఎమ్మెస్సీ: బయలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ,
ఎకనామిక్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్.
3) బిట్స్, పిలానీ - హైదరాబాద్ క్యాంపస్
బీఈ: కెమికల్, సివిల్,
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్టుమెంటేషన్,
మెకానికల్ తదితరాలు.
ఎమ్మెస్సీ: బయలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ,
ఎకనామిక్స్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్.
అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. 2022లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నవారు, 2021లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి
అర్హులు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
ఆన్లైన్ టెస్ట్ (బిట్ శాట్-2022) ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: బిట్ శాట్-2022 పరీక్షా సమయం 3 గంటలు ఉంటుంది. దీనిలో నాలుగు
విభాగాలు ఉంటాయి.
పార్ట్-1: పిజిక్స్ - 30 ప్రశ్నలు
పార్ట్-2: కెమిస్ట్రీ - 30 ప్రశ్నలు
పార్ట్-3: ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ - 10 ప్రశ్నలు లాజికల్
రీజనింగ్ - 20 ప్రశ్నలు
పార్ట్-4: మ్యాథమేటిక్స్/ బయాలజీ (బీఫార్మ్ అభ్యర్థులకు) - 40
ప్రశ్నలు
ఈ పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్
ఛాయిస్ రూపంలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ కింద 1 మార్కు
తీసేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: పురుష అభ్యర్థులు -
రూ.3400,
మహిళా అభ్యర్థులు - రూ.2900 చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా
కేంద్రాలు: హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి,
విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.03.2022.
దరఖాస్తులకు చివరి తేది: 21.05.2022.
పరీక్ష తేదీలు: 2022 జూన్ 20 నుంచి 26 వరకు.
0 Komentar