Cabinet Approves 3% DA Hike for Central
Government Employees
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు
ఇచ్చే డీఆర్ 3శాతం పెంపు
కరవు భత్యం (డీఏ) 3శాతం
పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో
నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు
ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం
అంగీకరించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగల డీఏ 31
శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 34 శాతానికి చేరింది.
ఈ పెంపు జనవరి 1, 2022 నుంచే వర్తిస్తుందని కేబినెట్ భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక
ప్రకటనలో వెల్లడించారు. కేంద్రం నిర్ణయంతో 47.68 లక్షల మంది
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు
ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50కోట్ల మేర అదనపు భారం పడనుంది.
కాగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల
డీఏ పెంచడం ఆరు నెలల్లో ఇది రెండోసారి కావడం విశేషం. అంతకుముందు గతేడాది
అక్టోబరులో దీపావళి కానుకగా డీఏను 3శాతం పెంచారు. జులై 2021
నుంచే ఆ పెంపు వర్తిస్తుందని ప్రకటించారు. కరోనా మహమ్మారితో
నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆ మధ్య ఏడాదిన్నర పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు
కరవు భత్యాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. 2021 జులైలోనే
దాన్ని పునరద్ధరిండమే గాక, ఒకేసారి 11శాతం
పెంచారు.
#Cabinet approves an increase of 3% Dearness Allowance to Central Government employees and Dearness Relief to Pensions, due from 01.07.2021
— PIB India (@PIB_India) October 21, 2021
An increase of 3% over the existing rate of 28% of the Basic Pay / Pension: Union Minister @ianuragthakur
#CabinetDecisions pic.twitter.com/fBZQyhpcyT
0 Komentar