CSIR Innovation Award for School
Children 2022 – Details Here
* 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు అర్హులు.
* 2022 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్ల లోపు వయసున్న వారికే అవకాశం కల్పిస్తారు.
15
మంది వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచే అరుదైన అవకాశం ఇది.
విద్యార్థుల ప్రతిపాదలు సమాజానికి దోహదపడేలా ఉండాలి. ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఇవి పోటీ నిర్వహణ సంస్థకు చేరాలి.
ప్రతిపాదిత సాఫ్ట్ కాపీని ciasc.ipu@niscair.res.in కు మెయిల్ ద్వారా పంపాలి. హార్డు కాపీని రిజిస్టరు పోస్టు, కొరియర్ ద్వారా హెడ్, సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్
ప్రొటెక్షన్ యూనిట్, విజయన్ సుచన భవన్, 14 సత్సంగ్ విహార్ మార్గ్, స్పెషల్
ఇనిస్టిట్యూషనల్ ఏరియా, న్యూదిల్లీ-110067 చిరునామాకు పంపాలి. ఆలోచనలు, భావనలు..డిజైన్,
డాటా, నమూనాల ద్వారా విశదీకరించాలి.
పోటీలు ఆన్‌లైన్ ద్వారా
నిర్వహిస్తారు. నమూనాలు, డాటా, డిజైన్‌ల
రూపకల్పనలో ఇతరుల సహాయం తీసుకుంటే వారి వివరాలు తప్పకుండా పొందుపర్చాలి. టైటిల్,
విద్యార్థి పేరు, చిరునామా, పాఠశాల చరవాణి సంఖ్య, జనన తేదీ వంటివి పేర్కొనాలి.
పాఠశాల యాజమాన్యం అనుమతి పత్రం తప్పనిసరి.
* నమూనాలు సమస్యలకు
ప్రతిపాదనలు చూపగలగాలి.
* సరికొత్త ఆలోచనలు,
భావనలు ప్రస్ఫుటమవ్వాలి.
* అంతిమంగా సమాజానికి
దోహదపడాలి.
* ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లోనే ఉండాలి.
* 5 వేల పదాలకు మించకూడదు.
0 Komentar