East Coast Railway Apprentice
Recruitment 2022: Apply for 756 Apprentice
Posts – Details Here
ఈస్ట్‌కోస్ట్ రైల్వే జాబ్
రిక్రూట్‌మెంట్: 756 అప్రెంటిస్ పోస్టులను భర్తీ – పూర్తి వివరాలు
ఇవే
ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆర్ఆర్‌సీ
భువనేశ్వర్ పరిధిలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ
నోటిఫికేషన్ ద్వారా 756 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ ట్రేడ్ లు, వర్క్
షాప్ లో యాక్ట్ అప్రెంటీస్ ఈ ఖాళీ ఉన్నాయి.
ఖాళీల వివరాలకు సంబంధించి క్యారేజ్
రిపేర్ వర్క్ షాప్ మంచేశ్వర్, భువనేశ్వర్ లో 190 అప్రెంటిస్
ఖాళీలు.. ఖుర్దా రోడ్ డివిజన్ లో 237 ఖాళీలు.. వాల్టెయిర్ డివిజన్ లో 263 ఖాళీలు..
సంబల్పూర్ డివిజన్ లో 66 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే
అభ్యర్ధులు 10వ తరగతి 50శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ
కోర్సు చేసి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 15 సంవత్సరాల నుండి 24
సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు పీజుగా 100 రూపాయలు చెల్లించాల్సి
ఉంటుంది.
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తుల
సమర్పణకు మార్చి 7, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.
0 Komentar