Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Gadkari Launches India's First Green Hydrogen Fuel-Cell EV Toyota Mirai

 

Gadkari Launches India's First Green Hydrogen Fuel-Cell EV Toyota Mirai

టయోటా మిరాయ్‌: ఫ్యూయల్‌ సెల్‌ విద్యుత్‌ వాహనం - 5 నిమిషాల్లో రీఫ్యూయలింగ్‌ -  ఒక ఛార్జింగ్‌తో 650 కి.మీ.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆవిష్కరణ - తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఈవీ

దేశంలో తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత అడ్వాన్స్‌డ్‌ ఫ్యూయల్‌ సెల్‌ విద్యుత్‌ వాహనం (ఎఫ్‌సీఈవీ) టయోటా మిరాయ్‌ను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ఆవిష్కరించారు. ఉద్గారాలు వెదజల్లని, పూర్తి పర్యావరణ హితంగా ఈ హైడ్రోజన్‌ విద్యుత్‌ వాహనాన్ని టయోటా రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం 5 నిమిషాల్లో రీఫ్యూయలింగ్‌ చేసుకోవచ్చని, ఒకసారి ఛార్జింగ్‌తో 650 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

గ్రీన్‌ హైడ్రోజన్‌ను పునరుత్పాదక ఇంధనం నుంచి తయారు చేయొచ్చని, దీనికి అవసరమైన బయోమాస్‌ సమృద్ధిగా అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీలు (ఐసీఏటీ) సంయుక్తంగా ఎఫ్‌సీఈవీ సాంకేతికతను మిరాయ్‌పై పరీక్షిస్తున్నాయి. 2014లో ఆవిష్కరించిన టయోటా మిరాయ్‌లో రెండో తరానికి చెందిన వాహనం ఇది.

DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags