UGC Releases Draft Framework For 4-Yr
Undergrad Courses
నాలుగేళ్ల డిగ్రీలో ఎప్పుడైనా
బయటకు వెళ్లొచ్చు - ముసాయిదా
మార్గదర్శకాలను విడుదల చేసిన యూజీసీ
నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం
నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్, క్రెడిట్
విధానంపై యూజీసీ (విశ్వవిద్యాలయాల నిధుల సంఘం) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల
చేసింది. నాలుగేళ్ల డిగ్రీకి 160 క్రెడిట్లు ఉండాలని
సూచించింది. నాలుగేళ్లలో విద్యార్థి ఎప్పుడైనా బయటకు వెళ్లేందుకు అవకాశం
కల్పించింది.
రెండు సెమిస్టర్లు పూర్తి చేస్తే
సర్టిఫికెట్ ఇస్తారు. రెండేళ్లు చదివితే డిప్లొమా, మూడేళ్లు పూర్తి
చేస్తే డిగ్రీ, నాలుగేళ్లు చదివితే ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. 15 గంటల బోధన, 30 గంటల ప్రాక్టికల్స్, ఫీల్డ్‌వర్క్, కమ్యూనిటీ ప్రాజెక్టులకు ఒక్కో
క్రెడిట్‌ను ఇవ్వాలని యూజీసీ సూచించింది. ప్రాజెక్టు వర్క్, తరగతి బయట చేసే ప్రాజెక్టులు, బోధన, ఇంటర్న్‌షిప్, ల్యాబొరేటరీ వర్క్ ఇలా ప్రతి దానికి
ఎన్నెన్ని క్రెడిట్లు ఇవ్వాలో పేర్కొంది. ఈ ముసాయిదా నిబంధనలపై ఏప్రిల్ నాలుగో
తేదీ లోపు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.
0 Komentar