Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు

◼◼◼◼◼◼◼◼◼◼

1.  ప్రశ్న:

UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??

జవాబు:

FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.

◼◼◼◼◼◼◼◼◼◼

2.  ప్రశ్న:

SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??

జవాబు:

DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.

◼◼◼◼◼◼◼◼◼◼

3.  ప్రశ్న:

మహిళా టీచర్ భర్త నిరుద్యోగి. అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు. అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు. మెడికల్ రీఅంబర్సుమెంట్ వర్తిస్తుందా??

జవాబు:

APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ, నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.

◼◼◼◼◼◼◼◼◼◼

4.  ప్రశ్న:

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను. ఐతే ఏమి చెయ్యాలి??

జవాబు:

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేయించి, DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేయించాలి. స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయించాలి.

◼◼◼◼◼◼◼◼◼◼

5.  ప్రశ్న:

నేను PF నుండి ఋణం పొందియున్నాను. వాయిదాలు పూర్తి కాలేదు. మరలా ఋణం కావాలి. ఇస్తారా??

జవాబు:

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags