Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Help Road Accident Victims, Get Cash Reward: TN CM Stalin Announces New Scheme

 

Help Road Accident Victims, Get Cash Reward: TN CM Stalin Announces New Scheme

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసిన వారికి నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రం – ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

సరికొత్త కార్యక్రమానికి తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే సాయపడేలా ఓ వినూత్న పథకాన్ని రూపొందించారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయమందించి వైద్య సదుపాయాలు అందించడంలో తోడ్పడే వ్యక్తులకు నగదు బహుమతులతో పాటు ధ్రువపత్రాలు అందిస్తామని  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ‘రోడ్డ ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర సాయం చేసి వైద్య చికిత్సకు తరలించేందుకు తోడ్పాటునందించిన వారికి రూ.5000 నగదు, ప్రశంసాపత్రం అందిచనున్నాం’ అని స్టాలిన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో ఉచిత వైద్యం అందించే ఓ పథకాన్ని సీఎం స్టాలిన్‌ గతంలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 609 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘గోల్డెన్‌ అవర్‌’ పేరుతో ఈ సదుపాయాన్ని కల్పించారు. ఈ పథకంలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందే బాధితులకు గరిష్టంగా రూ.లక్ష వరకు రాయితీ ఇస్తోంది. కేవలం రాష్ట్ర ప్రజలకే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి పర్యటనకు వచ్చి గాయపడిన వారికి కూడా ఈ పథకాన్ని అందుబాటులో ఉంచడం విశేషం. ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహాలో ప్రోత్సాహం అందిస్తే ప్రమాదాల్లో గాయపడినవారికి సకాలంలో చికిత్స అంది వారి ప్రాణాలు నిలుస్తాయని తమిళనాడు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags