How The Ukraine War Has Created a Crisis
for Indian Newspapers
భారత పత్రికలపైనా రష్యా-ఉక్రెయిన్
యుద్ధ ప్రభావం – కారణాలు ఇవే
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
భారత వార్తా పత్రికలపైనా పడుతోంది. భారత న్యూస్‌ప్రింట్ దిగుమతుల్లో దాదాపు 45% వాటా రష్యాదే. అయితే, రష్యా నౌకాశ్రయాల నుంచి
బుకింగ్‌లను తీసుకోవడాన్ని పలు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు నిలిపివేశాయి.
దీంతో అక్కడ కంటైనర్లన్నీ నిలిచిపోయాయి. రష్యా బ్యాంకులపై ఆంక్షలూ వాణిజ్యాన్ని
మరింత సంక్లిష్టం చేశాయి. దీంతో న్యూస్‌ప్రింట్ సరఫరాదార్ల కోసం భారత
వార్తాపత్రికలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు పేపరు మిల్లుల్లో న్యూస్‌ప్రింట్
ఉత్పత్తి వ్యయంలో దాదాపు 30% వాటా ఉండే అంతర్జాతీయ ఇంధనం
(సహజ వాయువు, బొగ్గు) ధరలూ పెరగడం ఇబ్బందులకు గురి
చేస్తోంది.
రెట్టింపైన ధర: ఫిన్‌లాండ్‌లో
అతిపెద్ద న్యూస్‌ప్రింట్ తయారీదారు యూపీఎమ్‌లో కార్మికులు సమ్మెలో ఉన్నారు. భారత
గ్లాసీ న్యూస్‌ప్రింట్ దిగుమతుల్లో 60% ఈ కంపెనీ నుంచే
ఉంటుంది. కరోనా వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, దేశీయంగా పలు తయారీదార్లు తమ మిల్లులను ప్యాకేజింగ్ సామగ్రి తయారీ వైపు
మళ్లించడం వల్ల న్యూస్‌ప్రింట్ సరఫరాలో కొరత ఏర్పడింది. ఇవన్నీ కలసి న్యూస్‌ప్రింట్
దిగుమతి ధరలను రెట్టింపు చేశాయి. 2019లో టన్ను న్యూస్‌ప్రింట్
ధర 450 డాలర్లుగా ఉండగా.. ఇపుడు 950
డాలర్లకు చేరింది. వార్తా పత్రికల తయారీ వ్యయంలో 40-50% వరకు
న్యూస్‌ప్రింట్‌కే అవుతుంది. సిరాలు, ప్రింటింగ్‌కు వాడే
అల్యూమినియం ప్లేట్లు, రవాణా ఖర్చులు వంటివీ వార్తాపత్రికల
వ్యయాలపై ప్రభావం చూపుతోంది. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వం
మద్దతు ఇవ్వాలని వార్తాపత్రికల పరిశ్రమ కోరుతోంది.
0 Komentar