IPL-2022 Bookmyshow Bags Exclusive
Ticketing Rights for IPL Season 15
ఐపిఎల్ 2022: ఈ సారి టికెట్లు విక్రయాలు ‘బుక్ మై షో’లో మాత్రమే – వివరాలు ఇవే
టికెట్ బుకింగ్ వేదిక బుక్ మై
షో బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ
సీజన్‌కు సంబంధించిన టికెట్ల విక్రయ హక్కులను సంపాదించింది. టికెటింగ్ రైట్స్‌తో
పాటు అన్ని స్టేడియంలలో గేట్ ఎంట్రీ, స్పెక్టేటర్ మేనేజ్‌మెంట్
సర్వీసులను కూడా అందించనుంది. ఈ మేరకు ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మార్చి 26
నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో 10 జట్లు తలపడనున్నాయి.
మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబయి, నవీ ముంబయి, పుణెలో నాలుగు మైదానాలను బీసీసీఐ ఎంపిక
చేసింది. ముంబయిలోని వాంఖడే, బ్రాబౌర్న్ మైదానాల్ల్లో 20 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో 15,
పుణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 15
మ్యాచ్‌లు జరగనున్నాయి.
వాంఖడేలో తొలి మ్యాచ్ చెన్నై
సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ
నేపథ్యంలో బుధవారం నుంచే టికెట్ బుకింగ్‌కు అవకాశం ఇస్తున్నామని బుక్ మై షో
తెలిపింది. ఒక్కో టికెట్ ధర రూ.800 నుంచి ప్రారంభమవుతుందని
పేర్కొంది. రెండు నెలల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు 25 శాతం
సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ బుధవారమే వెల్లడించడం
గమనార్హం.
Phone se niklo aur #StadiumPeMilo. 🏏
— BookMyShow (@bookmyshow) March 23, 2022
Get your tickets here: https://t.co/yYydJFofWU #TATAIPL pic.twitter.com/P3r3esbkol
0 Komentar