IPL Schedule 2022: BCCI Announces
Schedule for TATA IPL 2022
ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్ విడుదల - కేకేఆర్, సీఎస్‌కే మధ్య
తొలి మ్యాచ్
టాటా ఐపీఎల్ 15వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభమవుతాయని బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. ముంబయి, పుణె నగరాల్లోని నాలుగు మైదానాల్లో దాదాపు 65 రోజులపాటు 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ - 15 (IPL 2022)వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఆరంభమవుతుందని వెల్లడించింది. వాంఖడే స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుందని తెలిపింది. గత సీజన్‌లో ఈ రెండు జట్లు ఫైనల్‌కు వచ్చాయి. కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో మొత్తం పది జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీపడతాయి. ఒక్కో
జట్టు 14 మ్యాచ్‌లను ఆడుతుంది. మార్చి 27వ తేదీ నుంచి డబుల్ హెడ్డర్ (రోజుకు రెండు మ్యాచ్‌లు) ప్రారంభమవుతుందని
బీసీసీఐ షెడ్యూల్‌లో పేర్కొంది. ‘‘పుణె వేదికగా మొదటి మ్యాచ్ మార్చి 29న ఎంసీఏ స్టేడియంలో జరుగుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. వాంఖడే, డీవై
పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రాబోర్నె,
ఎంసీఏ మైదానాల్లో పదిహేనేసి మ్యాచ్‌లు నిర్వహిస్తాం’’ అని బీసీసీఐ
ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ 15వ సీజన్
మార్చి 26 నుంచి ప్రారంభమై మే 29న ముగుస్తాయి.
0 Komentar