LIC: Opportunity for Policyholders to
Revive Lapsed Policies - Details Here
పాలసీ పునరుద్ధరణకు మరో అవకాశం
ఇచ్చిన ఎల్ఐసీ - రద్దయిన ఎల్‌ఐసీ పాలసీని ఎలా పునరుద్ధరించుకోవాలి?
పాలసీదారులకు లైఫ్ ఇన్సూరెన్స్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. పాలసీదారులు తమ లాప్స్ అయిన పాలసీలను
పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పించింది. 2022 ఆర్ధిక
సంవత్సరంలో రెండవ సారి ఈ అవకాశాన్ని తమ పాలసీదారులకు ఎల్ఐసీ కల్పించింది. దీనిలో
భాగంగా పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన జీవిత బీమా పాలసీలను ఆలస్య రుసుములో రాయితీని
పొంది పునరుద్ధరించుకోవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా
చెల్లించిన మొత్తం ప్రీమియం ఆధారంగా టర్మ్ అస్యూరెన్స్, హై
రిస్క్ ప్లాన్‌లు కాకుండా మిగిలిన వాటికి మాత్రమే ఆలస్య రుసుములో రాయితీని
అందిస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది.
ఒకవేళ మీరు ల్యాప్స్ అయిన పాలసీకి
రూ. లక్ష వరకు ప్రీమియం చెల్లించినట్లైతే, ఆలస్య రుసుములో 20 శాతం వరకు రాయితీని ఎల్ఐసీ ప్రకటించింది. అయితే, రాయితీ
గరిష్ట పరిమితి రూ. 2000 మాత్రమే. అదే విధంగా, ఒకవేళ మీరు రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు ప్రీమియం చెల్లించినట్లైతే, ఆలస్య
రుసుములో 25 శాతం వరకు రాయితీని పొందవచ్చు. దీని గరిష్ట
పరిమితి రూ. 2500. అలాగే ఒకవేళ మీరు రూ. 3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించినట్లైతే, ఆలస్య
రుసుములో 30 శాతం వరకు రాయితీని పొందవచ్చు. దీని గరిష్ట
పరిమితిని రూ. 3000గా ఎల్ఐసీ నిర్ణయించింది. అదే మైక్రో
ఇన్సూరెన్స్ ప్లాన్‌ల పునరుద్ధరణకు మాత్రం ఆలస్య రుసుములో 100 శాతం రాయితీని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ అవకాశం మార్చి 25, 2022 వరకు మాత్రమే అందుబాటులో
ఉంటుంది.
===========
LIC: రద్దయిన ఎల్‌ఐసీ
పాలసీని ఎలా పునరుద్ధరించుకోవాలి?
============
0 Komentar