List Of SBI Branches to Be Opened on
26th & 27th Of March 2022
ఈ శని, ఆదివారాల్లో (మార్చి 26&27) ఎస్‌బీఐలో రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించొచ్చు
సెలవు దినాలైనా ప్రత్యేకంగా పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచులు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో
దస్తావేజుల రిజిస్ట్రేషన్స్‌కు సంబంధించిన వివిధ రకాల ఫీజులను ఈ నెల 26(శని), 27(ఆది) తేదీల్లో ఎస్‌బీఐ శాఖల్లో
చెల్లించవచ్చని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ
శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెలవు దినాలైనప్పటికీ రాష్ట్రంలోని 52 ఎస్‌బీఐ శాఖలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఆర్థిక సంవత్సరం చివరి రోజులు
కావడంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏర్పాటు చేసింది.
ఎస్బీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల
చలానాలు కట్టించుకునేలా ఒప్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్
రామకృష్ణ కోరారు.
0 Komentar