Ministry of Defence approves setting up
of 21 new Sainik Schools
దేశవ్యాప్తంగా 21
సైనిక్ స్కూల్స్‌కు రక్షణ శాఖ ఆమోదం – ఏపీ, తెలంగాణ కు ఒక్కొక్క సైనిక్ స్కూల్
* దేశవ్యాప్తంగా కొత్తగా 21
సైనిక్ స్కూల్స్‌కు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది నుంచి భాగస్వామ్య
పద్ధతిలో ఇవి నడుస్తాయని రక్షణ శాఖ పేర్కొంది.
* కొత్తగా వచ్చేవి ప్రస్తుతం ఉన్న
సైనిక్ స్కూల్స్‌కు భిన్నంగా ఉంటాయని వెల్లడించింది. కొత్తగా వచ్చే 21
సైనిక్ స్కూల్స్‌లో 7 పాఠశాలలు డే స్కూల్స్, 14 పాఠశాలల్లో హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపింది.
* ఈ జాబితాలో కడపలోని పూజ
ఇంటర్నేషనల్ స్కూల్, కరీంనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ సైనిక్
స్కూల్‌కు చోటు లభించింది.
==============
ప్రొద్దుటూరులో సైనిక పాఠశాల - పూజ ఇంటర్నేషనల్ స్కూల్‌కు అనుమతి - 6వ తరగతిలో ప్రవేశాలు
ప్రైవేటు సైనిక పాఠశాలలు వచ్చే
విద్యా సంవత్సరం (2022-23) నుంచి అందుబాటులోకి రానున్నాయి. దేశ
వ్యాప్తంగా 100 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో
భాగంగా శనివారం మొదటి విడతగా 21 పాఠశాలలకు రక్షణ శాఖ ఆమోదం
తెలిపింది. ఈ జాబితాలో ఏపీ నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరులోని పూజ
ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణ నుంచి కరీంనగర్‌లోని సోషల్
వెల్ఫేర్ సైనిక స్కూల్‌కు స్థానం దక్కింది. అనుమతి పొందిన విద్యా సంస్థలు ఈనెల 31లోపు సైనిక స్కూల్ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. సైనిక
పాఠశాలల్లో ఆరో తరగతిలో మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఇందులో ఎన్ని సీట్లు
ఉండాలనేది సైనిక స్కూల్ సొసైటీ త్వరలో
నిర్ణయించనుంది. అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్‌ఈఈ) ద్వారా
కొన్ని సీట్లను భర్తీ చేస్తారు. మిగతా వాటికి ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు
ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. వీటిల్లో అర్హత సాధించిన వారికి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలల్లో ఫీజులను గరిష్ఠంగా
రూ.40వేలుగా నిర్ణయించనున్నారు. ఆరో తరగతిలో ప్రవేశాలు
పొందిన వారిలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 50శాతం మందికి
మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫీజులను చెల్లిస్తుంది. ఒక్కో పాఠశాలకు గరిష్ఠంగా రూ.20లక్షల వరకు మాత్రమే ఇస్తుంది.
0 Komentar