NETS 2022: Registration Begins for SHRESHTA
Scheme, Know Important Details Here
శ్రేష్ఠ పథకం ద్వారా 9,11 తరగతులలో ప్రవేశాలు - దరఖాస్తుకు ఏప్రిల్ 12 తుది గడువు
NETS: National Entrance Test for SHRESHTA
SHRESHTA: Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas
శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్సియల్
ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాస్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్) ద్వారా
భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సిబిఎస్ఇ అఫిలియేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్
నందు పూర్తి ఉచితముగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక
కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తముగా ౩౦౦౦ మంది విద్యార్థులకు
9 వ తరగతి, 11 వ తరగతిలో ప్రవేశం కోసం అవకాశం
కలిపించడం జరుగుతుందన్నారు.. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల డ్రాప్ అవుట్ రేట్ ను
నియంత్రించే ప్రయత్నం లో భాగముగా అర్హులైన విద్యార్థులకు ఈ అవకాశం ఉపకరిస్తుందని
గంధం చంద్రుడు తెలిపారు.
9 వ తరగతి లో అడ్మిషన్
పొందిన విద్యార్థులు 11 వ తరగతి వరకు, 11 వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 12 వ తరగతి
వరకు విద్యాబ్యాసం చేస్తారని, 12 వ తరగతి తరువాత పోస్ట్
మెట్రిక్ ఉపకార వేతనం పథకం, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం
ద్వారా ఉన్నత విద్యని అభ్యసించేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
https://jnanabhumi.ap.gov.in/
వెబ్ లింక్ ద్వారా పథకం మార్గదర్శకాలు లభ్యం అవుతాయని, https://shreshta.nta.nic.in/ వెబ్ లింక్ ద్వారా అర్హులైన విద్యార్థిని విద్యార్థులు ఏప్రిల్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం
చంద్రుడు సూచించారు.
NETS
• పరీక్ష తేది: 7 మే, 2022
• ప్రవేశ పరీక్ష అన్ని
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించబడును.
• ఇంగ్లీష్/ హిందీ
మాధ్యమాలు రెండింటిలో నిర్వహించబడుతుంది.
అర్హత:
• ప్రస్తుత విద్యా సంవత్సరం
(2021-22)లో తరగతి 8 మరియు 10 చదువుతున్నషెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు.
• తల్లిదండ్రుల వార్షిక
ఆదాయం రూ.2.5 లక్షల వరకు ఉండాలి.
దరఖాస్తు:
• అభీష్టం గల మరియు
అర్హులైన SC విద్యార్థులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఉచితంగా తమంతట
తాము నమోదు చేసుకోవచ్చును.
• పోర్టల్ 14 మార్చి ఉ. 11.00 గంటలకు ప్రారంభమై 12 ఏప్రిల్ 2022 వరకు ఉంటుంది.
ఫలితం
మరియు ప్రవేశం:
• పరీక్ష ఫలితం 20 మే లోగా ప్రకటించబడుతుంది.
• ప్రవేశం కోసం వెబ్
కౌన్సెలింగ్ 21 మే నుండి 30 మే వరకు
నిర్వహించబడుతుంది.
0 Komentar