New Royal Enfield Scram 411 Launched: Price,
Features and Specs Details Here
రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త బైక్
స్క్రామ్ 411 విడుదల – ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే
ధర రూ.2.03 లక్షలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త బైక్ స్క్రామ్ 411ను విపణిలోకి విడుదల చేసింది. పరిచయ ఆఫర్ కింద రూ.2.03 లక్షల (ఎక్స్-షోరూమ్ చెన్నై) నుంచి ఈ బైక్ విక్రయిస్తామంది. రంగును బట్టి స్క్రామ్ 411 ధరలు రూ.2,03,085- 2,08,593 శ్రేణిలో ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎల్‌ఎస్-410 ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌పై ఈ బైక్‌ను తయారుచేశారు.
దృఢత్వం కలిగిన సరికొత్త ఛాసిస్‌తో
పట్టణ రహదారులతో పాటు కఠిన మార్గాల్లోనూ మెరుగ్గా ప్రయాణించవచ్చని కంపెనీ
తెలిపింది. 411 సీసీ, 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ 6500 ఆర్‌పీఎం వద్ద 24.3 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుందని,
గరిష్ఠ టార్క్ 32 ఎన్‌ఎం అని వివరించింది.
డిజిటల్ స్క్రీన్‌పై ఆటో మీటర్, ట్రిప్ మీటర్, టైమ్, ఫ్యూయల్ గేజ్, సర్వీస్
రిమైండర్ వంటి సంకేతాలు, ముందు-వెనుక డిస్క్ బ్రేక్‌లు,
డ్యూయల్-ఛానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
The Royal Enfield Scram 411 is made for the ‘switch’ - a motorcycle that calls unpredictability its playground. Engage Scram Mode!
— Royal Enfield (@royalenfield) March 15, 2022
Visit: https://t.co/J5y2Yeu0R1
Music Track: ScramMode by Sickfliphttps://t.co/J6QCkVWAlR#ReadySetScram #Scram411 #RoyalEnfieldScram pic.twitter.com/RmcjBG0VL7
0 Komentar