Pradeep Mehra, the Running Noida Teen, praised
by Anand Mahindra for Being 'Aatmanirbhar'
ప్రదీప్ మెహ్రా స్ఫూర్తిదాయక యువకుడి పరుగు వీడియో వైరల్
ఆ కుర్రాడు ‘ఆత్మనిర్భరతకు ప్రతీక’ అని పొగిడిన ఆనంద్ మహీంద్రా
సాయం చేస్తానన్న రిటైర్డ్
జనరల్ సతీశ్ దువా
ఆర్మీలో చేరాలన్న కల ఉన్నా.. ఆర్థిక స్తోమత కారణంగా శిక్షణ తీసుకోలేక.. నోయిడా వీధుల్లో అర్ధరాత్రి పరిగెడుతూ వెళ్తోన్న 19 ఏళ్ల యువకుడు ప్రదీప్ మెహ్రా స్ఫూర్తిదాయక వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఆ యువకుడి జీవితం ఆత్మనిర్భరతకు ప్రతీక అని కొనియాడారు.
‘‘ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే అతడి కథ నుంచి నేను పొందిన స్ఫూర్తి ఏంటో తెలుసా?ఆ యువకుడు ఎవరి మీదా ఆధారపడని వ్యక్తి. లిఫ్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు. అతడికి ఎవరి అవసరం లేదు. అతడు ఆత్మనిర్భరత కలిగిన వ్యక్తి’’ అని మహీంద్రా ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఆనంద్ మహీంద్రాతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రదీప్ మెహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆ యువకుడికి శిక్షణ ఇప్పిస్తా..
ఇదిలా ఉండగా ప్రదీప్ మెహ్రాకు
శిక్షణలో సాయం అందించేందుకు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా
ముందుకొచ్చారు. ‘‘అతడిలోని ఆత్మవిశ్వాసం అద్భుతం. అతడు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో
పాసయ్యేలా సాయం చేయాలనుకుంటున్నా. దీని గురించి ఇప్పటికే ఆర్మీ తూర్పు కమాండర్
లెఫ్టినెంట్ జనరల్ రానా కలితాతో మాట్లాడాను. ఆ యువకుడి రిక్రూట్‌మెంట్ కోసం
అవసరమైన శిక్షణ అందించడంలో రానా అతడికి సాయం చేస్తారు’ అని వెల్లడించారు.
This is indeed inspiring. But you know what my #MondayMotivation is? The fact that he is so independent & refuses the offer of a ride. He doesn’t need help. He is Aatmanirbhar! https://t.co/8H1BV4v5Mr
— anand mahindra (@anandmahindra) March 21, 2022
Watch #PradeepMehra’s 20 second SPRINT to lift your Monday SPIRITS ❤️ https://t.co/UnHRbJPdNa pic.twitter.com/nLAVZxwauq
— Vinod Kapri (@vinodkapri) March 21, 2022
0 Komentar