Prices Of 800 Essential Medicines,
Including Paracetamol, Set to Rise By 10.7% From April
పారాసెటమాల్ సహా పెరగనున్న 800 ఔషధాల ధరలు – వివరాలు ఇవే
జ్వరం, ఇన్ఫెక్షన్, బీపీ వంటి వ్యాధులకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలు ఏప్రిల్ నుంచి పెరగనున్నాయి. వీటి ధరలు 10.8శాతం పెరగనున్నట్లు జాతీయ ఔషధాల ధరల సంస్థ (National Pharmaceutical Pricing Authority - NPPA) ఓ ప్రకటనలో వెల్లడించింది.
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడించిన టోకు ద్రవ్యోల్బణ సూచీ గణాంకాల ప్రకారం.. 2021 సంవత్సరానికి గానూ మందుల టోకు ధరల సూచీని ఎన్‌పీపీఏ తాజాగా వెల్లడించింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సూచీ 10.7శాతం పెరిగినట్లు ప్రకటించింది. అంటే.. అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 షెడ్యూల్డ్ మందుల ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10.7శాతం పెరగనున్నాయి.
జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ వచ్చే నెల నుంచి ప్రియం కానున్నాయి. ఇందులో పారాసెటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి ఔషధాలున్నాయి.
విటమిన్స్, మినరల్స్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇందులో
కొన్నింటిని కొవిడ్ బాధితులకు చికిత్సలోనూ ఉపయోగిస్తున్నారు. మహమ్మారి కారణంగా
తయారీ ఖర్చులు పెరగడంతో ఈ ఔషధాల ధరలను పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు
వినిపిస్తున్న నేపథ్యంలో ఔషధాల ధరల నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలుస్తోంది.
0 Komentar