TS: Changes in TET Qualifications - GO
and Guidelines Issued
తెలంగాణ: టెట్ అర్హతల్లో మార్పులు - జి.ఓ మరియు మార్గదర్శకాలు జారీ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతిచ్చింది. టెట్ అర్హతల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ సారి టెట్ పేపర్–1కు
బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. దీంతో ఒకటి నుంచి ఐదో
తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాలకు ఇకపై బీఈడీ అభ్యర్థులు కూడా అర్హత
పొందనున్నారు. అయితే వీళ్లు ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రైమరీ ఎడ్యుకేషన్లో 6 నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని నిబంధన విధించారు. ఎన్‌సీటీఈ
మార్గదర్శకాల మేరకు టెట్ అర్హత కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి
సవరించింది. ఫలితంగా 2011 నుండి 2017
వరకు నిర్వహించిన టెట్ లు ఇకపై లైఫ్ టైం వ్యాలిడిటీ పొందాయి. ఈ నిర్ణయం వల్ల 50 వేల మందికి లబ్ది చేకూరనున్నది. ఒకటి రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్
విడుదల చేసి, మేలో పరీక్ష నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాటు
చేస్తోంది.
జాతీయ ఉపాధ్యాయ విద్యా
మండలి (ఎన్‌సీటీఈ) ఆదేశాల మేరకు టెట్ పేపర్ -2కు బీఈడీ అభ్యర్థులు కూడా
అర్హులేనని జీవో జారీ చేసింది. దీంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ
ఉద్యోగాలకు బీఈడీ అభ్యర్థులకు అర్హత రానుంది. అయితే, ఉద్యోగంలో
చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సు
పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎన్‌సీటీఈ మార్గదర్శకాల మేరకు టెట్
అర్హత కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి సవరించింది. రాష్ట్రంలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ
నియామకాలకు వీలుగా ముందుగా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఏర్పాట్లు
చేస్తోంది. రాష్ట్రంలో సుమారు 3లక్షల మంది అభ్యర్థులు టెట్
కోసం ఎదురు చూస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్
జారీ చేయనుంది.
Memo.No.3744/Ser.III/2021,Dated
23.03.2022.
Sub: School Education - Conduct of
TS-TET (Telangana State Teacher Eligibility Test) - Certain amendments to
guidelines for conducting Telangana State Teachers Eligibility Test issued -
Permission to conduct TS-TET - Reg.
Ref: 1. G.O.Ms.No.36, School Edn(Trg.)
Dept., dt.23.12.2015.
2. Minutes of the Meeting of Group of
Ministers held on 02.3.2022 at Dr.MCR HRD, Hyd.
3. From the Director of School
Education, Telangana, Hyderabad, Lr.Rc.No.SPL/R.C/2022, Dated: 09-03-2022.
4. G.O.Ms.No. 8, School Edn.(Ser. III)
Dept., dt.23.03.2022.
0 Komentar