TS EAMCET-2022: Counselling All the Details Here
టీఎస్ ఎంసెట్-2022: కౌన్సెల్లింగ్ పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE 26-09-2022
రెండవ ఫేజ్ సవరించిన
కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు ఇవే
ఎంసెట్ రెండో
విడత కౌన్సెలింగ్ తేదీలను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
సెప్టెంబర్ 28 నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్ ను
వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తిరిగి అక్టోబర్ 11 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది.
అక్టోబర్ 11, 12న స్లాట్ బుకింగ్, అక్టోబర్ 12న రెండో విడత ధ్రువతాల పరిశీలన, 12, 13న వెబ్ అప్షన్ల నమోదు ప్రక్రియ, అక్టోబరు 16న సీట్లను కేటాయింపు
ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటనలో తెలిపింది.
===================
UPDATE 31-08-2022
THE LAST DATE FOR SLOT BOOKING EXTENDED
UP TO 01 SEPT 2022
CERTIFICATE VERIFICATION UP TO 02 SEPT
2022
OPTION ENTRY UP TO 03 SEPT 2022
===================
UPDATE 21-08-2022
తెలంగాణ
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ (TS EAMCET Counselling) షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఇంజనీరింగ్ కేటగిరీ
మొదటి విడత కౌన్సెల్లింగ్ తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రక్రియ: ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 1 వరకు
సర్టిఫికేషన్ వెరిఫికేషన్: ఆగస్టు 23- సెప్టెంబర్ 2 వరకు
వెబ్
ఆప్షన్ల ఎంపిక: ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 3 వరకు
మొదటి విడత
సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 6న
===================
UPDATE
12-08-2022
RESULTS
LINKS
===================
ఇంజనీరింగ్ కేటగిరీ 👇
===================
అగ్రికల్చర్ & మెడికల్ కేటగిరీ 👇
===================
===================
UPDATE 11-08-2022
తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం (Aug 12) విడుదల కానున్నాయి. ఉదయం 11.15 గంటలకు ఈసెట్, ఉదయం 11.45 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేయనున్నారు.
===================
UPDATE 04-08-2022
అగ్రికల్చర్ & మెడికల్ కేటగిరీ 👇
MASTER
QUESTION PAPERS WITH PRELIMINARY KEYS
===================
UPDATE
31-07-2022
ఇంజనీరింగ్ కేటగిరీ 👇
MASTER
QUESTION PAPERS WITH PRELIMINARY KEYS
===================
UPDATE 27-07-2022
అగ్రికల్చర్ &
మెడికల్ పరీక్ష తేదీలు: 30, 31-07-2022
===================
UPDATE 19-07-2022
వాయిదా పడ్డ
ఎంసెట్ (AM) పరీక్షల తాజా షెడ్యూల్ ఇదే
CLICK
HERE FOR REVISED EXAM DATES
===================
UPDATE
17-07-2022
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఆన్ లైన్ పరీక్షలు జులై 18న ప్రారంభం కానున్నాయి. రోజూ రెండు విడతలుగా జులై 20వ తేదీ వరకు
పరీక్షలు జరుగుతాయి.
మొత్తం 1,72,241 మంది దరఖాస్తు చేశారు. గత ఏడాది ఆ
సంఖ్య 1.65 లక్షలు మాత్రమే. ఈ సారి తెలంగాణలో 89, ఏపీలో 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ మాట్లాడుతూ.. ఒక రోజు ముందుగా కేటాయించిన కేంద్రాన్ని చూసుకొని రావాలని, పరీక్ష ప్రారంభానికి గంట ముందే అక్కడికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్ పై ఉన్న సూచనలను క్షుణ్నంగా చదవాలని కోరారు. హాల్ టికెట్ తోపాటు పూర్తి చేసిన ఫారాన్ని, గుర్తింపు కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలని చెప్పారు. మాస్కు ధరించి హాజరు కావాలన్నారు.
ఇంజినీరింగ్ పరీక్ష తేదీలు: 18, 19, 20.07.2022
===================
UPDATE 13-07-2022
తెలంగాణ ఎంసెట్ పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామన్న అధికారులు తాజాగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
* భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి (14, 15) జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేశారు.
* జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ యథాతథంగా జరుగుతాయని తెలిపారు.
* వాయిదా పడిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
UPDATE 11-07-2022
===================
భారీ వర్షాల
నేపథ్యంలో తెలంగాణలో ఈసెట్ పరీక్ష వాయిదా - ఎంసెట్ పరీక్షలు యథాతథం
===================
UPDATE
26-06-2022
పరీక్ష తేదీలు:
అగ్రికల్చర్ అండ్ మెడిసిన్: 14, 15.07.2022
ఇంజినీరింగ్: 18, 19, 20.07.2022
===================
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి
(టీఎస్ సీహెచ్ ఈ) టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని
ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్,
మెడికల్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జవహర్‌లాల్
నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్)
నిర్వహిస్తోంది.
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్:
(టీఎస్ ఎంసెట్-2022):
అర్హత: టెక్నాలజీ, ఇంజినీరింగ్
కోర్సుల్లో ప్రవేశాలు పొందే అభ్యర్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,
కెమిస్ట్రీ! బయోటెక్నాలజీ/ బయోలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/
ఆప్షనల్, ఒకేషనల్ కోర్సులు ఉత్తీర్ణత / డిప్లొమా చివరి
సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
* ఇంజినీరింగ్/ అగ్రికల్చర్
అండ్ మెడిసిన్ సంబంధించి ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
* ఇంజినీరింగ్/ అగ్రికల్చర్
అండ్ మెడిసిన్ ఇతరులు రూ.800 చెల్లించాలి.
* ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్
అభ్యర్థులు ఇంజినీరింగ్ & అగ్రికల్చర్ అండ్ మెడిసిన్)
రూ.800 చెల్లించాలి.
* ఇతరులు ఇంజినీరింగ్ &
అగ్రికల్చర్ అండ్ మెడిసిన్) రూ.1600
చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 06.04.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28.05.2022 (ఆలస్య రుసుం లేకుండా).
పరీక్ష తేదీలు:
అగ్రికల్చర్ అండ్ మెడిసిన్: 14, 15.07.2022
ఇంజినీరింగ్: 18, 19,
20.07.2022
0 Komentar