TS: ఉద్యోగ నియామకాలకు
గరిష్ఠ వయోపరిమితి పెంపు పై ఉత్తర్వులు జారీ
ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ
వయోపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 80వేల
పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి, వయో పరిమితిని కూడా పెంచుతామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణగా సాధారణ
పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో
పరిమితిని పదేళ్లపాటు పెంచింది. దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ
అర్హత వయస్సు 44 ఏళ్లకు పెరిగింది. గరిష్ఠ వయో పరిమితి పెంపు
రెండేళ్ల పాటు వర్తించనుంది. ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే,
యూనిఫాం సర్వీసులైన పోలీసు, అగ్నిమాపక,
జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మాత్రం గరిష్ఠ వయో
పరిమితి పెంపు వర్తించదు.
0 Komentar