TS: తిరిగి విధుల్లోకి ఉపాధి
హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు - మధ్యాహ్న భోజన కార్మికులకు
పారితోషికం రూ.3వేలకు పెంపు
నీటి పారుదల శాఖలోకి వీఆర్‌ఏలు
లష్కర్లుగా వీఆర్‌ఏలు - వివిధ శాఖల ఖాళీల్లోకి వీఆర్‌ఓలు
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
మధ్యాహ్న భోజన కార్మికులకు
పారితోషికం రూ.3వేలకు పెంపు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో
పనిచేస్తున్న 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికుల పారితోషికాన్ని
పెంచుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రస్తుతం వారికి
నెలకు రూ.వెయ్యి ఇస్తున్నారనీ, దాన్ని రూ.3వేలకు పెంచుతున్నట్టు చెప్పారు.
లష్కర్లుగా వీఆర్‌ఏలు - వివిధ
శాఖల ఖాళీల్లోకి వీఆర్‌ఓలు
వీఆర్‌ఏ, వీఆర్‌ఓ
ల అంశాన్ని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించగా,
సీఎం కేసీఆర్ దానికి వివరణ ఇచ్చారు. వీఆర్‌ఏలను నీటి పారుదల శాఖలో
లష్కర్లుగా ఆప్షన్ ఇచ్చి నియమిస్తామని చెప్పారు. వీఆర్‌ఓలను ప్రస్తుతం వివిధ
శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి స్కేల్‌ను బట్టి వారిని అడ్జెస్ట్ చేస్తామని
తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులను త్వరగా
పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు..
రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ
పథకం తో ఉన్న 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని
అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.
0 Komentar