TS TET-2022: All the Details Here
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2022: పూర్తి వివరాలు ఇవే
==================
UPDATE 15-07-2022
వెబ్ సైట్లో
టెట్ ఓఎంఆర్ పత్రాలు
* టెట్ ఓఎంఆర్ పత్రాలను ఎస్ సీఈఆర్టీ అధికారులు జులై 14న వెబ్ సైట్లో ఉంచారు.
* వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.15 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
==================
UPDATE 01-07-2022
RESULTS LINKS
==================
==================
PAPER 1
==================
PAPER II
==================
==================
UPDATE
30-06-2022
==================
UPDATE 28-06-2022
తెలంగాణలో
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. టెట్ ఫలితాలను
జులై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా ఈ నెల 27వ తేదీన టెట్
ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది.
దీనిపై
ఆదివారం రాత్రివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. తాజాగా ఫలితాల
విడుదలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 3,18,506 (90. 62శాతం), పేపర్-2కు 2.51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.
==================
UPDATE 27-06-2022
ఉపాధ్యాయ అర్హత
పరీక్ష(టెట్) ఫలితాలను ఈ నెల 27న వెల్లడిస్తామని
టెట్ నోటిఫికేషన్లోనే స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ దానిపై ఆదివారం రాత్రివరకు
అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. టెట్ కన్వీనర్ రాధారెడ్డి మాత్రం ఫలితాల
విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అంటే సోమవారం ఫలితాలు వెల్లడి
కాకపోవచ్చని భావిస్తున్నారు.
టెట్
ప్రాథమిక కీ విడుదల చేసినప్పటికీ.. ఫైనల్ కీ మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. దీంతో
ఒత్తిడికి గురవుతున్న టెట్ అభ్యర్థులు ఫైనల్ కీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈక్రమంలోనే ఫలితాల విడుదల ఆలస్యం అవుతున్నట్లు రాధా రెడ్డి చెప్పారు.
==================
UPDATE 15-06-2022
తెలంగాణ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రాథమిక కీ విడుదలైంది. వెబ్సైటులో టెట్ ప్రాథమిక
కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు. సమాధానాలపై అభ్యంతరాలుంటే జూన్ 18 లోపు ఆలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 12 టెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
==================
UPDATE 13-06-2022
తెలంగాణలో
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు కన్వీనర్ తెలిపారు.
ఉదయం
నిర్వహించిన పేపర్-1కు 3,18,506 (90. 62శాతం), పేపర్-2కు 2,51,070 (90.35శాతం) మంది
అభ్యర్థులు హాజరయ్యా రు.
టెట్
ఫలితాలను ఈనెల 27న విడుదల చేయనున్నట్టు కన్వీనర్
తెలిపారు.
==================
UPDATE
12-06-2022
పరీక్ష తేదీ: 12.06.2022
==================
PAPER-1 👇
QUESTION
PAPER (CODE A)
QUESTION
PAPER (CODE B)
QUESTION
PAPER (CODE C)
QUESTION
PAPER (CODE C) – MATHS KEY
QUESTION
PAPER (CODE C) WITH KEY
QUESTION
PAPER (CODE D)
==================
PAPER-2 👇
QUESTION PAPER (CODE C) – Social
QUESTION
PAPER (CODE D) – Social with Key
QUESTION
PAPER (CODE B) – Maths & Science
PAPER 2 – QUESTION
PAPER (CODE D) – Maths & Science
==================
TET PAPER – 2 ALL CODES KEYS 👇
==================
UPDATE 06-06-2022
DISTRICT
WISE HELP DESK NUMBERS
==================
TET Model Papers and Grand Tests 👇
==================
UPDATE 21-05-2022
‘టెట్’ వాయిదా కుదరదు:
మంత్రి సబిత
తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహించే
రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ
అభ్యర్థి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో కేటీఆర్ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫార్వర్డ్ చేశారు.
Request Minister @SabithaindraTRS Garu to consider https://t.co/3os4hO8jId
— KTR (@KTRTRS) May 21, 2022
ఈ నేపథ్యంలో సబిత స్పందిస్తూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ వాయిదా కుదరదు. అన్ని అంశాలను, ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకున్నాకే టెట్ పరీక్షపై నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు. కాగా జూన్ 12న తెలంగాణలో టెట్ పరీక్ష జరగనుంది.
==================
* ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అభ్యర్థులకు నేటి నుంచి జూన్ 5 వరకు టీశాట్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనుంది.
* పేపర్ 1 ఉదయం 8-8.30 గంటల
వరకు, పేపర్ 2 ఉదయం 8.30-9 గంటల వరకు మొత్తం 120 ఎపిసోడ్లు ప్రసారం చేయనుంది.
* తెలుగు, ఇంగ్లిష్,
సోషల్ స్టడీస్, సైన్స్, ఈవీఎస్,
బయాలజీ, చైల్డ్ హుడ్ డెవలప్ మెంట్ అండ్
పెడగోజీ సబ్జెక్టులపై శిక్షణ ఉంటుంది.
=================
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన
పాఠశాల విద్యాశాఖ విభాగం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్
(టెట్) 2022:
అర్హత: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ) / డీఈడీ / బీఈడీ / లాంగ్వేజ్ పండిట్ / తత్సమాన అర్హతలు ఉన్న
అభ్యర్థులతో పాటు చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం: టీచర్ ఎలిజిబిలిటీ
టెస్ట్ (టెట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: టీఎస్ టెట్ 2022 పరీక్షలో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు భోధించాలనుకునేవారు పేపర్ 1
పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు
భోధించాలనుకునేవారు పేపర్ 2 పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగరతి వరకు భోధించాలనుకునేవారు పేపర్ 1, పేపర్ 2 (రెండింటికి) హాజరుకావాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 26.03.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.04.2022.
హాల్ టికెట్లు డౌన్ లోడింగ్ తేది: 06.06.2022.
టెట్ 2022 పరీక్ష తేది: 12.06.2022
( పేపర్ 1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, పేపర్ 2: మధ్యాహ్నాం
2.30 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది).
ఫలితాల వెల్లడి: 27.06.2022.
KNOW
YOUR PREVIOUS TET HALL TICKET NUMBER
================
0 Komentar