UGC Vidyanjali Scheme: Colleges,
Students, Volunteers Can Apply – Check the Guidelines
యూజీసీ విద్యాంజలి పథకం: కళాశాల, విద్యార్థి
మరియు వాలంటీర్లు దరఖాస్తు చేసుకోవచ్చు – తాజా మార్గదర్శకాలు ఇవే
VIDYANJALI (Higher Education): A Scheme for
Support to the Students, Faculties & Institutions through Volunteerism.
విద్యాసంస్థలు, అధ్యాపకులు,
విద్యార్థులకు స్వచ్ఛందంగా సహాయం అందించే విద్యాంజలి పథకానికి
యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. అభ్యాసకులు, అధ్యాపకులు,
సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం, మౌలిక
సమస్యలను అధిగమించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొంది. దాతలు అకడమిక్,
పరిశోధన, ప్రయోగశాలలు, మౌలిక
సదుపాయాలు, బోధనలాంటి సదుపాయాలను అందించొచ్చు.
ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు, కంపెనీల
ప్రతినిధులు తమ అనుభవాలను విద్యార్థులకు అందించవచ్చు. ఇందుకోసం విద్యాసంస్థలు
ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా సహాయం
అందించేందుకు ముందుకొచ్చే వాలంటీర్లు, సంస్థలతో
వ్యవహరించాల్సిన తీరు, సేవలు పొందడం, వాటిపై
మదింపునకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం యూజీసీ వెల్లడించింది.
0 Komentar