World Happiness Report-2022: Finland
Tops For 5th Straight Year, Check India's Rank Here
వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2022: ఆనందకర దేశాల్లో వరుసగా 5వ సారి ఫిన్‌లాండ్ నెం.1, భారత్ ర్యాంక్ ఇదే
ప్రపంచంలోనే అత్యంతకర సంతోషకరమైన
దేశంగా ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 20న
‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని’ పురస్కరించుకుని ఐరాస శుక్రవారం ‘ప్రపంచ ఆనంద
నివేదిక - 2022’ను విడుదల చేసింది. మొత్తం 146 దేశాలతో ఈ జాబితా రూపొందించగా.. భారత్ 136వ
స్థానంతో సరిపెట్టుకుంది. అయితే గతేడాది కంటే ఈసారి భారత్ మూడు స్థానాలు
మెరుగుపర్చుకోవడం గమనార్హం.
FINLAND
ఈ జాబితాలో ఫిన్లాండ్ ప్రథమ
స్థానంలో నిలవడం వరుసగా ఇది ఐదోసారి కావడం విశేషం. దీని తర్వాత డెన్మార్క్, ఐస్‌ల్యాండ్,
స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ టాప్-5 స్థానాల్లో నిలిచాయి. అగ్రాజ్యం అమెరికా గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు
స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానం దక్కించుకుంది. ఇక
నిరుడు 19 స్థానంలో నిలిచిన చైనా.. ఈ సారి ఏకంగా 72వ ర్యాంక్‌కు పడిపోయింది. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్ అట్టడుగున ఉండగా..
లెబనాన్, జింబాబ్వే, రువాండాలో అల్ప
సంతోషకర దేశాలుగా ఐరాస ప్రకటించింది.
రష్యా యుద్ధంతో సతమతమవుతోన్న
ఉక్రెయిన్.. ఆనందకర దేశాల జాబితాలో 98వ స్థానంలో ఉంది. రష్యా 80వ స్థానం దక్కించుకుంది. 2012 నుంచి ఐరాసకు చెందిన
‘సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్’ ఏటా ప్రపంచ ఆనంద
నివేదికను వెల్లడిస్తూ వస్తోంది.
TOP 20 COUNTRIES: 👇
(1.) ఫిన్లాండ్ (=)
(2.) డెన్మార్క్ (=)
(3.) ఐస్‌లాండ్ (+1)
(4.) స్విట్జర్లాండ్ (-1)
(5.) నెదర్లాండ్స్ (=)
(6.) లక్సెంబర్గ్ (+2)
(7.) స్వీడన్ (=)
(8.) నార్వే (-2)
(9.) ఇజ్రాయెల్ (+3)
(10.) న్యూజిలాండ్ (-1)
(11.) ఆస్ట్రియా (-1)
(12.) ఆస్ట్రేలియా (-1)
(13.) ఐర్లాండ్ (+2)
(14.) జర్మనీ (-1)
(15.) కెనడా (-1)
(16.) యునైటెడ్ స్టేట్స్ (+3)
(17.) యునైటెడ్ కింగ్‌డమ్
(=)
(18.) చెక్ రిపబ్లిక్ (=)
(19.) బెల్జియం (+1)
(20.) ఫ్రాన్స్ (+1)
CLICK
FOR WORLD HAPPINESS REPORT-2022
Finland is the world's happiest country, for the fifth year in a row. 🇫🇮❤️Come for a visit! #visitkotkahamina #travel #Finland #happiness https://t.co/733kHLseWM @happinessrpt pic.twitter.com/mBxea9EU92
— Visit Kotka-Hamina (@kotkahaminafi) March 18, 2022
0 Komentar