World's Longest Car Restored and Renamed
as ‘The American Dream’, Now Has a Swimming Pool and Helipad
ప్రపంచంలోనే అతి పొడవైన కారు ‘ది
అమెరికన్ డ్రీమ్’ - గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కారు లో స్విమ్మింగ్
పూల్, హెలిప్యాడ్
ప్రపంచంలోనే అతి పొడవైన కారు.
అందులో ఒక స్విమ్మింగ్ పూల్, మినీ గోల్ఫ్ కోర్స్, ఓ హెలిప్యాడ్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్ రికార్డు
సాధించిన ‘ది అమెరికన్ డ్రీమ్’ అనే కారు.. ఇప్పుడు సకల సౌకర్యాలతో
పునర్నిర్మితమై తన రికార్డును అదే బద్దలుకొట్టింది. అంతేకాదండోయ్.. ఈ కారు పొడవు
కూడా ఇంకాస్త పొడవు పెరిగింది. 30.54 మీటర్ల (100 అడుగుల 1.50 అంగుళాలు) పొడవుండే ఈ కారు ఫొటోను
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
నిజానికి ఈ కారును 1986లోనే తయారుచేశారు. కాలిఫోర్నియాకు చెందిన కార్ కస్టమైజర్ జాయ్ ఓర్‌బెర్గ్
తొలుత ఈ కారును రూపొందించారు. సాధారణంగా కార్లు 12 నుంచి 16 అడుగుల పొడువు ఉంటాయి. కానీ జాయ్ ఈ కారును 18.28
మీటర్ల(60 అడుగులు) పొడువుతో తయారుచేశారు. 26 చక్రాలు, రెండు వీ8 ఇంజిన్లతో
దీన్ని రూపొందించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దీని పొడవును 30.5 మీటర్లకు (100 అడుగులు) పెంచారు. ఈ కారును రెండు
వైపుల నుంచీ నడపొచ్చట.
లగ్జరీ ఫీచర్లు..
అయితే చాలా కాలం పాటు
మరమ్మతుల్లోనే ఉన్న ఈ కారును ఇటీవలే పునరుద్ధరించారు. అంతేగాక, ఇందులో
అనేక లగ్జరీ సదుపాయాలను కూడా ఏర్పాటు చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ డేటా
తెలిపింది. ఇందులో ఒక పెద్ద వాటర్‌బెడ్, బాత్ టబ్,
డైవింగ్ బోర్డ్‌తో ఉండే స్విమ్మింగ్ పూల్, మినీ
గోల్ఫ్ కోర్స్, హెలిప్యాడ్, టీవీలు,
ఫోన్, ఫ్రిజ్ వంటి సకల సదుపాయాలు ఉన్నాయట. 75 మంది ఒకేసారి ఇందులోకి ఎక్కొచ్చు.
ఈ కారు తయారుచేసిన తొలినాళ్లలో
అనేక సినిమాల్లో ది అమెరికన్ డ్రీమ్ కన్పించింది. చాలా మంది దీన్ని అద్దెకు కూడా
తీసుకున్నారు. అయితే దీన్ని నిర్వహణ ఖర్చులు పెరగడం, పార్కింగ్ సమస్యలు
తలెత్తడంతో ప్రజలకు దీనిపై ఆసక్తి తగ్గింది. దీంతో ఈ కారును ఇ-బేలో అమ్మకానికి
పెట్టారు. అరుదైన ఆటోమొబైల్ వాహనాలపై ఆసక్తి కలిగిన మైఖెల్ మ్యానింగ్ అనే
వ్యక్తి ఈ కారును ఇ-బేలో చూసి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు.
అయితే తన వద్ద అంత డబ్బులు
లేకపోవడంతో డిజెర్‌ల్యాండ్ పార్క్‌కార్ మ్యూజియం యజమాని మైఖెల్ డిజెర్‌తో కలిసి
కారును కొనుగోలు చేశారు. వీరిద్దరూ దాదాపు 2.5లక్షల డాలర్లను
ఖర్చుచేసి కారుకు మరమ్మతులు చేసి లగ్జరీ సదుపాయాలతో పునరుద్ధరించారు. అయితే ఈ
కారును రోడ్లపైకి తీసుకురారట. ఫ్లోరిడాలోని డిజెర్‌ల్యాండ్ పార్క్ కార్
మ్యూజియంలో సందర్శనకు ఉంచనున్నట్లు మైఖెల్ తెలిపారు.
Equipped with a swimming pool, golf putting green and a helipad.
— Guinness World Records (@GWR) March 10, 2022
0 Komentar