AP Cash Transfer Scheme from May - Money
instead of Rice
రేషన్ బియ్యం వద్దంటే డబ్బులు - నగదు బదిలీ దిశగా పౌరసరఫరాల శాఖ
కిలోకు రూ. 12-15 మధ్య ఇచ్చే అవకాశం
రేషన్ కార్డుదారులు అవసరమైతే
బియ్యం తీసుకోవచ్చు. వద్దంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇస్తుంది. మే
నెల నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు దిశగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా నగదు పంపిణీ చేస్తారు.
తొలుత కొన్ని ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ
నిర్ణయించింది.
జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, గాజువాక
ప్రాంతాలతో పాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడలను
ఎంపిక చేశారు. తర్వాత దశలవారీగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు. దీనిపై ఈ నెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు
తీసుకుంటారు. 23న వీఆర్వో పరిశీలన, 25న
తహసీల్దార్ ఆమోదం తీసుకుంటారు. కార్డుదారులకు కిలోకు ఎంత ఇవ్వాలనేది ఇంకా
నిర్ణయించలేదు. రూ. 12 నుంచి రూ.15
మధ్య ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
కావాలంటే మళ్లీ బియ్యం:
బియ్యానికి బదులు నగదు ఇవ్వడంపై
ముందుగా కార్డుదారుల అభిప్రాయం తీసుకుంటారు. వారు అంగీకరిస్తే నగదు ఇస్తారు. రెండు
నెలల పాటు నగదు తీసుకున్నా ఆ తర్వాత నెలలో కావాలంటే బియ్యం తీసుకోవచ్చు. మొదట
వాలంటీర్ల ద్వారా నగదు అందించాలని యోచిస్తున్నారు. అనంతరం ఖాతాల్లోకి బదిలీ చేసే
ప్రతిపాదన ఉంది.
0 Komentar