సీపీఎస్ రద్దు అంశంపై ఐదుగురు
సభ్యుల కమిటీ గురించి జి.ఓ జారీ - సీపీఎస్ స్థానంలో జీపీఎస్ - ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన
====================
ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్
స్కీమ్ (సీపీఎస్) రద్దు అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు
మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేస్తూ
తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
GAD - Cabinet – Constitution of a
Committee to examine the issue of Contributory Pension Scheme and to deliberate
with Employees’ Association – Orders - Issued
G.O.Rt.No.716, Dated: 25.04.2022
====================
సీపీఎస్ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో సీపీఎస్ రద్దు అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్‌శర్మ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
ఉద్యోగ సంఘాల ముందు కొత్త
ప్రతిపాదన..
రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) పేరిట కొత్త స్కీం తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీపీఎస్ బదులు జీపీఎస్ పథకం అమలు చేయాలని ప్రతిపాదన చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తూ.. ‘‘సీపీఎస్ స్థానంలో జీపీఎస్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. జీపీఎస్‌పై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. పాత పెన్షన్ విధానమే కావాలని ప్రభుత్వాన్ని కోరాం. కొత్త స్కీంపై మేం అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం. జీపీఎస్ పేరిట కొత్త స్కీమ్ ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారని సమాచారం.
0 Komentar