AP EAPCET-2022: Special Round Seat Allotment Orders Released
ఏపీ ఈఏపీ సెట్ 2022: ప్రత్యేక దశ కౌన్సెల్లింగ్ సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
==================
UPDATE
11-11-2022
SEAT ALLOTMENT
ORDER & SELF-REPORTING
==================
UPDATE
06-11-2022
ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 07/11/2022 నుంచి 08/11/2022 వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 08/11/2022 నుంచి 09/11/2022 వరకు
వెబ్ ఆప్షన్ల ఎంపిక: 07/11/2022 నుంచి 09/11/2022 వరకు
సీట్ల కేటాయింపు: 11/11/2022
కళాశాలలో రిపోర్టింగ్: 11/11/2022 నుంచి 14/11/2022 తేదీలోగా చేయాలి.
==================
UPDATE
28-10-2022
DOWNLOAD FINAL
PHASE ALLOTMENT LETTER AND SELF REPORTING
==================
UPDATE
18-10-2022
Final Phase Counselling Details
ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు మరియు రిజిస్ట్రేషన్:
19/10/2022 నుంచి 21/10/2022 వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 19/10/2022 నుంచి 21/10/2022 వరకు
వెబ్ ఆప్షన్ల ఎంపిక: 19/10/2022 నుంచి 22/10/2022 వరకు
ఆప్షన్లలో మార్పులకు అవకాశం: 23/10/2022
సీట్ల కేటాయింపు: 26/10/2022
కళాశాలలో రిపోర్టింగ్: 26/10/2022 నుంచి 31/10/2022 తేదీలోగా
చేయాలి.
==================
UPDATE 22-09-2022
==================
UDDATE 11-09-2022
ఈఏపీ సెట్-2022 సవరించిన కౌన్సెల్లింగ్ షెడ్యూల్ ఇదే
వెబ్ ఆప్షన్ల
ఎంపిక: 13-09-2022 నుండి 17-09-2022 వరకు,
ఆప్షన్లలో
మార్పులకు అవకాశం: 18-09-2022 న
సీట్ల
కేటాయింపు: 22-09-2022 న
కళాశాలలో
రిపోర్టింగ్: 23-09-2022 నుంచి 27-09-2022 వరకు
తరగతుల ప్రారంభం:
26-09-2022
==================
UPDATE
03-09-2022
ఈఏపీ సెట్-2022
కౌన్సెలింగ్ కు ఇంటర్మీడియట్ అర్హత మార్కుల్లో సడలింపు
ఈఏపీ సెట్-2022
కౌన్సెలింగ్ కు ఇంటర్మీడియట్ అర్హత మార్కుల్లో సడలింపులు ఇస్తూ ఉన్నత
విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో
ఏడాదిలో కలిపి 45%, లేదా రెండో ఏడాదిలోనే 45% మార్కులు
ఉన్నా ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గ్రూపు
సబ్జెక్టుల్లో 45% మార్కులు ఉన్నా అర్హులే. రిజర్వుడు అభ్యర్థు లకు 40% మార్కులు సరిపోతాయి.
కరోనా కారణంగా మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. అందర్నీ
ఉత్తీర్ణులు చేసి, కనీస ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. మార్కుల మెరుగుకు
సప్లిమెంటరీ నిర్వహించినా కొందరు పరీక్షలు రాయలేదు. దీంతో చాలామందికి అర్హత
మార్కులు తగ్గాయి. ఈ నేపథ్యంలో సడలింపులు ఇచ్చారు. మినహాయింపు ఈ ఒక్క ఏడాదికే
వర్తిస్తుంది.
==================
UPDATE 28-08-2022
ఈఏపీసెట్
వెబ్ ఆప్షన్ల నమోదు వాయిదా - రిజిస్ట్రేషన్
ప్రక్రియ గడువు పెంపు
ఏపీ ఈఏపీసెట్ – 2022 అడ్మిషన్ల వెబ్ కౌన్సెలింగ్ లో భాగంగా ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను వాయిదా వేసినట్లు కన్వీనర్ సి.నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. 'వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్, తరగతుల ప్రారంభానికి సంబంధించి సవరించిన షెడ్యూల్ త్వరలో తెలియజేస్తామన్నారు.
ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం
ఎదురుచూస్తున్న విద్యార్థుల ప్రయోజనం కోసం రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్
ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను సెప్టెంబర్
5 వరకు పొడిగించామని చెప్పారు.
==================
UPDATE 19-08-2022
ఏపీఈఏపీ సెట్
కౌన్సెలింగ్ షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో
ఇంజనీరింగ్ లో పాటు ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు (ఏపీఈఏపీ సెట్-2022) బుధవారం వెబ్ కౌన్సెలింగ్ కు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల
చేసింది.
షెడ్యూల్ ఇదే:
ఆన్లైన్ లో
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: ఆగస్టు 22 నుంచి 30వ తేదీ వరకు,
సర్టిఫికెట్ల
వెరిఫికేషన్: ఆగస్టు 23 నుంచి 31 వరకు, సెప్టెంబర్ 05 వరకు
వెబ్ ఆప్షన్ల
ఎంపిక: 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 2 వరకు,
ఆప్షన్లలో
మార్పులకు అవకాశం: సెప్టెంబర్ 3న
సీట్ల
కేటాయింపు: సెప్టెంబర్ 6వ తేదీన
కళాశాలలో రిపోర్టింగ్:
సెప్టెంబర్ 6 నుంచి 12వ తేదీలోగా చేయాలి.
వెబ్ కౌన్సెలింగ్ కు రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు సమస్యలు తలెత్తితే కన్వీసర్ కార్యాలయాన్ని convenorapeapcet2022@gmail.com హెల్ప్ సెంటర్ 79956 81678, 79958 65456 నంబర్లను సంప్రదించవచ్చు.
==================
UPDATE
28-07-2022
==================
UPDATE 26-07-2022
ఆంధ్రప్రదేశ్
ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల
చేశారు.
ఈఏపీ సెట్
ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
==================
ENGINEERING
==================
AGRICULTURE & PHARMACY
==================
==================
UPDATE 25-07-2022
ఈఏపీసెట్ -2022
ఫలితాల విడుదల తేదీ ఇదే
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో
ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలను రేపు అనగా జులై 26 ఉదయం 11 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ లో విడుదల చేయనున్నారు. ఈఏపీ సెట్ ను ఈ ఏడాది జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ
విద్యాలయం (అనంతపురం) జులై 4 నుంచి 12 వరకు నిర్వహించింది.
మొదట అనంతపురంలో
జులై 29న విడుదల చేయాలని భావించిన అనివార్య కారణాలతో కార్యక్రమంలో మార్పు చేశారు.
==================
UPDATE 13-07-2022
MASTER
ENGINEERING QUESTION PAPER WITH PRELIMINARY KEYS 👇
RESPONSE
SHEETS 👇
KEY
OBJECTIONS 👇
==================
UPDATE 27-06-2022
పరీక్ష
తేదీలు:
ఇంజినీరింగ్:
04.07.2022
to 08.07.2022
అగ్రికల్చర్
అండ్ ఫార్మసీ: 11.07.2022 to 12.07.2022
==================
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత
విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల
చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్,
ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. 2022 విద్యాసంవత్సరానికిగాను ఈ పరీక్షను ఈ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్
యూనివర్సిటీ, అనంతపురం నిర్వహిస్తోంది.
ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ
తొలగింపు
ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్)లో
ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే
ర్యాంకులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది చదివిన విద్యార్థులు మొదటి
సంవత్సరంలో ఉన్నప్పుడు కరోనా కారణంగా మార్చిలో పరీక్షలు నిర్వహించలేదు.
విద్యార్థులందరికీ ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. ఎవరైనా మార్కులు ఎక్కువ
కావాలనుకుంటే సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని ఇంటర్ విద్యామండలి సూచించింది.
చాలా మంది విద్యార్థులు సప్లిమెంటరీ
పరీక్షలు రాశారు. ఎవరైనా అభ్యర్థులు ఈ పరీక్షలు రాయకపోతే నష్టపోతారనే ఉద్దేశంతో
ఇంటర్ మార్కులను వెయిటేజీని తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌లో
30శాతం పాఠ్యప్రణాళిక తగ్గించినందున ప్రవేశ పరీక్షలోనూ ఆ
పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వరు.
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్
అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2022)
కోర్సులు:
1. ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్
టెక్నాలజీ)
2. బీఎస్సీ(అగ్రికల్చర్ /
హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.
3. బీఫార్మసీ, ఫార్మా డీ.
అర్హత: ఇంటర్మీడియట్(సైన్స్/
మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన
ఉత్తీర్ణత.
వయసు: కనీసం 16
ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో
మెరిట్,
ఆన్లైన్ కౌన్సెలింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఇంజినీరింగ్/
అగ్రికల్చర్ అభ్యర్థులు ఓసీ-రూ.600, బీసీ-రూ.550, ఎస్సీ/ ఎస్టీ-రూ.500
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
11.04.2022
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.05.2022 (ఆలస్య రుసుం లేకుండా)
పరీక్ష తేది: సంబంధిత కోర్సును
అనుసరించి 04.07.2022 నుంచి 12.07.2022 వరకు
నిర్వహిస్తారు.
INSTRUCTION
BOOKLET FOR ENGINEERING
INSTRUCTION
BOOKLET FOR AGRICULTURE & PHARMACY
ENGINEERING
STREAM (E) SYLLABUS
0 Komentar