AP New Districts and Directory Codes
ఏపీ కొత్త జిల్లాలకు లోకల్
గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో 72
రెవెన్యూ డివిజన్‌లతో 26 జిల్లాలను(AP new districts)
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో
కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లను కేంద్రం జారీ
చేసింది. స్థానిక ప్రభుత్వాలను మ్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఎల్‌జీడీ కోడ్‌లను
కేటాయించారు.
జనగణన నుంచి ప్రభుత్వ పథకాల వరకూ
ఎల్‌జీడీ కోడ్ ద్వారానే కార్యక్రమాలను అమలు చేస్తారు. భౌగోళిక ప్రాంతాలు, రెవెన్యూ,
గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వాలను
కూడా లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్ ద్వారానే కేంద్రం మ్యాపింగ్ చేయనుంది.
పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అల్లూరి జిల్లాకు 745, అనకాపల్లి 744, కాకినాడ 746, కొనసీమ 747, ఏలూరు
748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్ల
జిల్లాకు 750, పలనాడుకు ఎల్జీడీ కోడ్‌గా 751, తిరుపతి 752, అన్నమయ్య 753, శ్రీసత్యసాయి
జిల్లాకు 754, నంద్యాల జిల్లాకు 755 జిల్లా కోడ్‌లను కేంద్రం కేటాయించింది. ఉమ్మడి
జిల్లాలకు 502 నుంచి 521 వరకూ జిల్లా
లోకల్ గవర్నమెంట్ కోడ్‌లను కేటాయించారు. ఏపీలో కొత్త ఏర్పాటైన 13 జిల్లాలతో కలిపి దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 755కు
చేరింది.
=================
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు
చేస్తూ తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ - పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల స్వరూపం
ఇదే
- 26 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్
కలెక్టర్లు మరియు ఎస్పీల నియామకం వివరాలు ఇవే 👇
===============
0 Komentar