AP POLYCET-2022: Spot Counselling Details Here
ఏపీ పాలిసెట్ 2022 – స్పాట్ కౌన్సెల్లింగ్ వివరాలు ఇవే
=======================
UPDATE 09-10-2022
=======================
UPDATE 10-09-2022
తుది దశ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తి - మిగిలిన 37,993 పాలీసెట్ సీట్లు
రాష్ట్రంలో భారీగా పాలీసెట్ సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది
మొత్తం డిప్లొమా -కోర్సుల్లో 36,349 మంది అడ్మిషన్లు తీసుకోగా.. 37,993 సీట్లు మిగిలిపోయాయని సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.
పాలీసెట్ తుది దశ కౌన్సెలింగ్ లో 4,312 మంది
విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు తెలిపింది. తుది దశ కౌన్సెలింగ్ లో 12,773 మంది ఆప్షన్లు పెట్టుకోగా 4,312 మందికి సీట్లు కేటాయించారు.
=======================
UPDATE
03-09-2022
ఏపీ పాలీసెట్ తుది దశ కౌన్సెల్లింగ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు తేదీ: 05-09-2022 నుండి 06-09-2022 వరకు
సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 05-09-2022 నుండి 07-09-2022
వరకు
ఆప్షన్ల ఎంట్రీ తేదీలు: 05-09-2022 నుండి 07-09-2022 వరకు
సీట్ల కేటాయింపు: 09-09-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 10-09-2022 నుండి 14-09-2022 వరకు
=======================
UPDATE 20-08-2022
డిప్లొమా
కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్ వెబ్ కౌన్సెలింగ్‌ను పూర్తిచేసిన
సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగించింది.
రాష్ట్రవ్యాప్తంగా 35,735 మంది విద్యార్థులకు
సీట్లు కేటాయించారు. మొత్తం సీట్లు 74,491కి గాను ఇంకా 38,756 సీట్లు
మిగిలిపోయాయి. మొత్తం 260 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు
పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ మేరకు సీట్ల కేటాయింపును పూర్తిచేశారు.
=======================
UPDATE 03-08-2022
పాలిసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ కు సంబంధించి దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీ
పాలిసెట్-2022 అడ్మిషన్ల కౌన్సెలింగ్ కు సంబంధించి
దరఖాస్తు గడువును ఆగస్ట్ 11వరకు
పొడిగిస్తున్నట్లు కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ
కమిషనర్ డాక్టర్ పోలాభాస్కర్ మంగళవారం తెలిపారు.
ఆన్లైన్ ఫీజు
చెల్లింపు, దరఖాస్తు సమర్పణ, సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్ట్ 11 వరకు గడువును పొడిగిస్తున్నట్లు వివరించారు. బుధవారం టెన్త్
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ విద్యార్థులకు
మేలు కలిగేలా పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు తెలిపారు.
తాజా
షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 6 నుంచి 11 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్ట 12 వరకు ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంది. సీట్లను 16న కేటాయించి 22 నుంచి తరగతులను ప్రారంభిస్తారు.
ముఖ్యమైన
తేదీలు:
ప్రాసెసింగ్
ఫీజు చెల్లింపు తేదీలు: జులై 27 నుంచి ఆగస్టు 11 వరకు
సర్టిఫికెట్ల
వెరిఫికేషన్ తేదీలు: జులై 29 నుంచి ఆగస్టు 11 వరకు
ఆప్షన్ల
నమోదు తేదీలు: ఆగస్టు 6 నుంచి 11 వరకు
ఆప్షన్ల సవరణ
తేదీ: ఆగస్టు 12న
సీట్ల
కేటాయింపు తేదీ: ఆగస్టు 16న
తరగతుల
ప్రారంభం: ఆగస్టు 22 నుండి
=======================
UPDATE 24-07-2022
రాష్ట్రంలో
పాలిటెక్నిక్ కళాశాల ల్లో చేరికలకు అడ్మిషన్ల షెడ్యూల్ శనివారం విడుదలైంది. ఈ నెల 24న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఏపీ
పాలిసెట్ కు 1,31,608 మంది హాజరు కాగా 1,20,867 మంది క్వాలిఫై అయ్యారు. పాలిసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
అడ్మిషన్ల షెడ్యూల్ ఖరారు చేశారు.
జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు
ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు సర్టిఫికెట్ల
వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్ ఆపన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. 12న ఆపన్ల సవరణ చేసుకోవచ్చు. 16న సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 17 నుంచి 21 వరకు సెల్స్ రిపోర్టింగ్ తో పాటు
కాలేజీలో రిపోర్ట్ చేయాలి. అదే నెల 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కాగా సర్టిఫికెట్ల పరిశీలనకు 34 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. స్పెషల్ కేటగిరీ
అభ్యర్థులకు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన
ఉంటుంది. ఇతర సమాచారం కోసం 7995681678 లేదా
7995865456 నంబర్లలో సంప్రదించాలి.
ముఖ్యమైన తేదీలు:
ప్రాసెసింగ్
ఫీజు చెల్లింపు తేదీలు: జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు
సర్టిఫికెట్ల
వెరిఫికేషన్ తేదీలు: జులై 29 నుంచి ఆగస్టు 5 వరకు
ఆప్షన్ల
నమోదు తేదీలు: ఆగస్టు 6 నుంచి 11 వరకు
ఆప్షన్ల సవరణ తేదీ: ఆగస్టు 8న
సీట్ల
కేటాయింపు తేదీ: ఆగస్టు 16న
తరగతుల ప్రారంభం: ఆగస్టు 22 నుండి
AP POLYCET-2021 LAST RANK DETAILS
AP
POLYCET MOCK COUNSELLING LINK
=======================
UPDATE
09-07-2022
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలి సెట్
ప్రవేశాల కౌన్సెలింగ్ ఆగస్టు 1 నుంచి ప్రారంభించనున్నట్లు
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. తరగతులను ఆగస్టు 22 నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రవేశాల నోటిఫికేషన్
తర్వలో విడుదల చేస్తామని తెలిపారు.
=======================
UPDATE 18-06-2022
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి.
పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 1,38,189మంది దరఖాస్తు చేయగా.. 1,31,627మంది హాజరయ్యారు. ఫలితాల్లో 91.84శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
90.56 శాతం బాలుర ఉత్తీర్ణత సాధించగా.. 93.96 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఎస్సీ, ఎస్టీ
విద్యార్థులు వందశాతం అర్హత సాధించారు.
=======================
UPDATE 17-06-2022
పాలీసెట్-2022
ఫలితాలను రేపు (జూన్ 18) ఉదయం 9:15 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలోని గేట్
వే హోటల్‌లో విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్
ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహించిన విషయం తెల్సిందే. ఇప్పటికే పాలిసెట్-2022 ఆన్సర్ కీని కూడా ఎస్‌బీటీఈటీ విడుదల చేసింది. ఈ ఫలితాలను
విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డ్
తెలిపింది. రిజిస్ట్రేషన్ వివరాలు, పుట్టిన
తేదీని నమోదు చేసుకొని ఈ ఫలితాలను పొందవచ్చును.
ర్యాంక్ కార్డు:
ఒకవేళ అర్హత
మార్కులలో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, పుట్టిన తేదీల
వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 25 శాతం
మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును https://polycetap.nic.in/ లేదా http://sbtetap.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Useful for Results 👇
=======================
UPDATE 03-06-2022
=======================
UPDATE
01-06-2022
=======================
=======================
ఆంధ్రప్రదేశ్-విజయవాడలోని స్టేట్
బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేసన్ అండ్ ట్రెయినింగ్ ఆంధ్రప్రదేశ్(ఎస్‌బిటిఈటి-ఏపీ)
2022-23 విద్యాసంవత్సరానికి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని
ద్వారా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్
టెస్ట్ (పాలీసెట్)-2022
అర్హత: పదో తరగతి/తత్సమాన
ఉత్తీర్ణత. కంపార్ట్ మెంట్ విధానంలో ఉత్తీర్ణులైన, 2022లో ఏప్రిల్/మే
నెలల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ
పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2022.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.05.2022.
పాలిసెట్-2022 పరీక్ష తేది: 29.05.2022.
APPLICATION FOR AWAITING
SSC (2022) RESULTS
APPLICATION FOR ALREADY GOT SSC
RESULTS
0 Komentar