Atal Pension Yojana: KYC Process using
Aadhaar for eAPY Registration
అటల్ పెన్షన్ యోజన: ఇకనుంచి APY రిజిస్ట్రేషన్ కోసం ఆధార్‌ని ఉపయోగించి KYC ప్రక్రియ – వివరాలు ఇవే
రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు నెలవారీ పెన్షన్ పొందే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) ఖాతాను ఎటువంటి బ్రాంచ్‌ను సందర్శించకుండా ఆధార్ `ఇకేవైసీ`తో ఆన్‌లైన్‌లో కూడా తెరవొచ్చు.
ఖాతా తెరవాలనుకునే వారు తమ ఆధార్ నంబర్‌ని ఉపయోగించి అటల్ పెన్షన్ యోజన ఖాతాను బ్యాంక్ ఖాతా సహకారంతో ఆన్‌లైన్‌లో సులభంగా తెరవవచ్చు. `ఏపీవై` ఫారమ్‌ని ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయవచ్చు. ఆధార్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ `ఏపీవై` ఖాతాను తెరిచేటప్పుడు, మీరు మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్‌తో నమోదు చేయబడిన ఫోన్ నంబర్, ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా అందించాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) నిర్వహించే ప్రభుత్వ సంస్థ అయిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) కూడా అటల్ పెన్షన్ యోజనకి రెగ్యులేటర్.
`ఇఏపీవై` బ్యాంక్ శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండానే ఇబ్బందులు లేని డిజిటల్ నమోదుని అనుమతిస్తుంది. శాఖకు వెళ్లకుండానే `ఏపీవై` ఖాతాను ఆన్‌లైన్‌లో తెరవడానికి `ఇఏపీవై` లింక్‌ను అన్ని `ఏపీవై` సేవా బ్యాంకుల వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయవచ్చు. అటల్ పెన్షన్ యోజన కోసం లింక్ సృష్టించబడిన NSDL NPS వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.
అటల్ పెన్షన్ యోజన 9 తేదీ మే, 2015లో ప్రారంభించబడింది. భారతీయులందరికీ, ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించడానికి అటల్ పెన్షన్ యోజన.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా నిర్వహించబడుతుంది. అటల్ పెన్షన్ యోజన అనేది రూ. 1000 - రూ. 5000 వరకు హామీ ఇవ్వబడిన పెన్షన్ పథకం. ఎటువంటి చట్టబద్దమైన సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి రాని, ఆదాయపు పన్ను చెల్లింపుదారు కానీ వారికి ప్రభుత్వంచే కంట్రిబ్యూషన్‌లో సహకారం అందచేయబడుతుంది. జూన్ 1, 2015 నుండి మార్చి 31, 2016 మధ్య కాలంలో స్కీమ్‌లో చేరిన అర్హులైన ప్రతి చందాదారుకు 5 ఏళ్ల పాటు భారత ప్రభుత్వం సహకారం అందచేస్తుంది.
అర్హతః 18-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హతగల (అసంఘటిత రంగంలో పనిచేసే) భారతదేశ పౌరులందరికీ అటల్ పెన్షన్ యోజనలో చందాదారులుగా నమోదు కావచ్చు. ఈ చందాకు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. చందాదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ, వార్షిక ప్రాతిపదికన ఈ పెన్షన్ స్కీమ్‌కి చందా ఇవ్వవచ్చు. చందాదారులు కొన్ని షరతులకు లోబడి స్వచ్ఛందంగా ఈ స్కీమ్ నుండి కూడా నిష్క్రమించవచ్చు.
60 ఏళ్ల అనంతరం నెలవారీ
పెన్షన్ చందాదారునికి అందుబాటులో ఉంటుంది. పెన్షన్ తీసుకునే వ్యక్తి తర్వాత అతని
జీవిత భాగస్వామికి పెన్షన్ తీసుకునే వ్యక్తి
మరణానంతరం చందాదారుని 60 ఏళ్ల వయస్సు వరకు సేకరించబడిన
పెన్షన్ నిధి, చందాదారుని నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది. `ఏపీవై`లో వడ్డీ రాబడి దాదాపు 8 శాతం చందాదారులకు హామీ ఇవ్వబడింది.
0 Komentar