CBSE Board Exam 2022-23: Syllabus Announced
- Two-Term System Discontinued – Details Here
సీబీఎస్ఈ విద్యార్థుల గతంలో మాదిరిగా వార్షిక పరీక్షలే - 9 నుండి 12 తరగతుల 2022-23 విద్యా సంవత్సరానికి సిలబస్ విడుదల
దేశవ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరానికి గతంలో మాదిరిగా వార్షిక పరీక్షలే నిర్వహించాలని
కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) నిర్ణయించింది. కరోనా కారణంగా 2021
- 22 విద్యా సంవత్సరంలో పాఠ్య ప్రణాళికను రెండు భాగాలుగా విభజించి
టర్మ్-1, టర్మ్-2గా పరీక్షలు జరపాలని
నిర్ణయించారు. గత నవంబరు - డిసెంబరులోనే టర్మ్-1ను బహుళ
ఐచ్ఛిక ప్రశ్నలు(ఎంసీక్యూ) విధానంలో నిర్వహించి వాటి ఫలితాలను ఇప్పటికే బోర్డు
ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి 10, 12వ
తరగతికి టర్మ్-2 రాత పరీక్షలు మొదలుకానున్నాయి.
తాజాగా 9-12 తరగతుల సిలబస్ ను కూడా సీబీఎస్ఈ విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2021-22)లో 30 శాతం సిలబస్ ను తగ్గించగా ఇప్పుడు పునరుద్ధరించారు.
అయితే 12వ తరగతి భౌతికశాస్త్రం, బిజినెస్
స్టడీస్ లాంటి కొన్ని సబ్జెక్టుల్లో 30 శాతానికి బదులు 15
శాతాన్నే కలిపినట్లు నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది పరీక్షలకు
సంబంధించి మాదిరి ప్రశ్నపత్రాలను వెబ్ సైట్లో పెడతామని బోర్డు పేర్కొంది.
CIRCULAR
ON CURRICULUM 2022-23
0 Komentar