CCRAS Recruitment 2022: Apply Online for
310 Ayurveda Doctors, Pharmacists and Other Posts
సీసీఆర్ఏఎస్ లో 310 పోస్టులు - ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు మరియు ఇతర
పోస్టుల వివరాలు ఇవే
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ
శాఖకు చెందిన న్యూదిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్
సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 310
1) ఆయుర్వేద స్పెషలిస్టులు: 40
విభాగాల వారీగా ఖాళీలు: పంచకర్మ-10, శాల్య-10,
కాయ చికిత్స-10, ప్రసూతి తంత్ర-10.
2) ఆయుర్వేద జనరల్ డ్యూటీ మెడికల్
ఆఫీసర్లు: 110
3) ఆయుర్వేద ఫార్మసిస్టులు: 150
4) పంచకర్మ థెరపిస్టులు: 10
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డీఫార్మా, ఆయుర్వేద డిగ్రీ, సంబంధిత కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 45
నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి
నెలకు రూ.18000 నుంచి రూ.75000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా
ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 26.04.2022.
దరఖాస్తులకు చివరి తేది: 05.05.2022.
రాత పరీక్ష తేది: 15.05.2022.
0 Komentar