Central Government Employees Can Now
Avail House Building Advance at Reduced Rate
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ
వడ్డీ రేటుతో ఇంటి రుణాలు ‘హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్’ (హెచ్‌బీఏ)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి
నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ‘హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్’ (హెచ్‌బీఏ) సరికొత్త
వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
ఇప్పుడు ఇంతకు ముందు కంటే తక్కువ వడ్డీ రేటుతో ఇంటి రుణాన్ని పొందొచ్చు. ఈ రుణం
ద్వారా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి
ఈ తగ్గిన వడ్డీ రేటు వర్తిస్తుంది. బ్యాంకులు అందించే ఇంటి రుణాల వడ్డీ రేట్లను,
మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ వడ్డీ రేట్లు ఆధారంగా చేసుకుని
కేంద్రం తమ ఉద్యోగులకు ఈ రుణ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ
వ్యవహారాల మంత్రిత్వశాఖ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు లభించే ఇంటి రుణాల
కోసం 7.10 శాతంగా వడ్డీ రేటును నిర్ణయించింది. ఇంతకు ముందు
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ
రేటు అక్టోబర్ 1, 2020 నుంచి మార్చి 31, 2022 వరకు అంటే 18 నెలలకు 7.90
శాతంగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 34 నెలల
ప్రాథమిక వేతనం, గరిష్ఠంగా రూ. 25 లక్షలు
లేదా ఇంటి ఖరీదు లేదా తిరిగి చెల్లించే సామర్థ్యం ప్రకారం మొత్తం, కొత్తగా ఇంటి నిర్మాణం, ఇల్లు, ఫ్లాట్ కొనుగోలు కోసం ఏది తక్కువైతే అది పరిగణిస్తారు.
‘హెచ్‌బీఏ’ నిబంధనల ప్రకారం
తీసుకున్న రుణ మొత్తమైన అసలును మొదటి 15 ఏళ్లలో అంటే 180 నెలసరి వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. వడ్డీని 60 నెలవారీ వాయిదాలలో చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగి,
5 సంవత్సరాలు నిరంతర పనిచేసిన వారు కలిగి ఉన్న తాత్కాలిక
ఉద్యోగులందరూ కూడా ‘హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్’ పొందొచ్చు. ఉద్యోగి పనిచేసే చోటే
ఇంటి నిర్మాణం చేపట్టనక్కర్లేదు. ఉద్యోగి సొంత ఊరిలో, భవిష్యత్తులో
నివాసముండే ప్రాంతంలో కూడా ఈ రుణంతో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు. ఇంటిని
కొనుగోలు చేయవచ్చు.
0 Komentar