Chrome For Desktop Gets New Google Lens
Features — You Can Now Translate and Copy Text Directly from Images
గూగుల్ లెన్స్‌లో కొత్తగా మరో
మూడు కొత్త ఆప్షన్లు – వివరాలు ఇవే
గూగుల్ రూపొందించిన ఇమేజ్ రికగ్నైజేషన్ టెక్నాలజీ గూగుల్ లెన్స్ కొత్త శక్తులతో యూజర్ల ముందుకు వస్తోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో మరింత సులభంగా, వేగంగా పనులు పూర్తి చేయడానికి మూడు కొత్త ఆప్షన్లను తీసుకురానుంది. ఇమేజ్ మీద టెక్ట్స్‌ను కాపీ చేయడానికి ‘కాపీ’, ఇతర భాషల్లోకి తర్జుమా చేయడానికి ‘ట్రాన్స్‌లేట్’, ‘ఫైండ్ ఇమేజ్ సోర్స్’ వంటి ఆప్షన్స్‌ను పరిచయం చేయనుంది. అయితే, వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ముందుగా విండోస్, క్రోమ్ ఓఎస్, మ్యాక్ వంటి వాటిలో అందుబాటులోకి తీసుకువస్తారని సమాచారం.
గూగుల్ లెన్స్ ఎలా పనిచేస్తుంది?
గూగుల్ లెన్స్ చేతితో రాసుకున్న
నోట్స్ నుంచి పేపర్ క్లిప్పింగ్ వరకూ ఎలాంటి టెక్ట్స్‌నైనా చదివి వినిపిస్తుంది.
ఆన్‌లైన్ షాపింగ్ నుంచి ఫుడ్ రేటింగ్, ట్రాన్స్‌లేషన్ వరకు
ఎన్నో రకాల పనులలో మీకు సాయపడుతుంది. ఉదాహరణకు మీకు వెబ్ పేజీలో టెక్ట్స్ చదవడం
కంటే ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటుందనిపించింది. ఇందుకోసం మీ బ్రౌజర్‌లో లెన్స్
ఓపెన్ చేసి దానిపై ఫ్రేమ్‌ని డ్రాగ్ చేస్తే అందులోని టెక్ట్స్‌ని చదివి
వినిపిస్తుంది. అలా మీకు నచ్చిన వంటకం, వస్తువులకు
సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. మనం
తీసుకున్న ఫొటో మీద క్లిక్ చేసి ఈ గూగుల్ లెన్స్ ఆన్ చేస్తే ఆ ఫొటో ఏ ప్రదేశంలో
తీశారో తెలుసుకోవచ్చు. అయితే, దీనికి మాత్రం ఫొటో దిగిన
ప్రదేశం బాగా ప్రసిద్ధి చెందినదై ఉండాలి. లేదంటే ఆ ఫొటో వెనుక ఉన్న పేర్లు,
అక్షరాలు క్లియర్‌గా కనిపించాలి. అలా అయితేనే గూగుల్ లెన్స్
సులువుగా సెర్చ్ చేసి సమాచారాన్ని ఇవ్వగలదు.
ఎలా ఎనేబుల్ చేయాలంటే?
* మీ పీసీలో గూగుల్ క్రోమ్
వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి chrome://flags అని టైప్ చేయాలి.
* తర్వాత ఎక్స్‌పరిమెంట్స్
పేరుతో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పైన సెర్చ్ ఆప్షన్ ఉంటుంది.
* అక్కడ Google Lens
అని టైప్ చేస్తే సెర్చ్ యువర్ స్క్రీన్ విత్ గూగుల్ లెన్స్ అని
కనిపిస్తుంది. దాని పక్కనే డిఫాల్ట్ అనే పేరుతో ఆప్షన్ బాక్స్ ఉంటుంది.
* దానిపై క్లిక్ చేస్తే
మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఎనేబుల్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కింద
రీలాంచ్‌పై క్లిక్ చేస్తే మీ క్రోమ్ బ్రౌజర్‌లో గూగుల్ లెన్స్ ఎనేబుల్ అవుతుంది.
* క్రోమ్ స్టేబుల్ వెర్షన్
93తోపాటు ఆపై డెస్క్‌టాప్ వెర్షన్లను మాత్రమే గూగుల్ లెన్స్
సపోర్ట్ చేస్తుంది.
0 Komentar