Google Banning All Call Recording Apps from
Play Store Starting May 11
కాల్ రికార్డింగ్ యాప్స్ గురించి
గూగుల్ పాలసీ అప్‌డేట్ - మే 11 నుంచి ప్లే స్టోర్‌లో కాల్ రికార్డ్ యాప్
ల నిషేధం
మొబైల్ వినియోగదారుల గోప్యత, భద్రతకు సంబంధించి గూగుల్ (Google) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థర్డ్ పార్టీ యాప్స్‌లో కాల్స్‌ను రికార్డు (Call Record) చేసే సౌలభ్యాన్ని నిలిపివేయబోతోంది. మే 11 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు గూగుల్ తన పాలసీని అప్‌డేట్ చేసింది.
కాల్ రికార్డింగ్‌కు ఫీచర్‌కు మొదటి నుంచీ గూగుల్ వ్యతిరేకం. గూగుల్ తన సొంత డెయిలర్ అప్లికేషన్‌లో సైతం కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు రికార్డ్ అవుతుంటే ఒక శబ్దాన్ని పుష్ చేసేది. తర్వాత రికార్డింగ్ ఫీచర్‌ను తన డెయిలర్‌లో తొలగించింది. అయితే, గూగుల్ ఈ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించినప్పటికీ.. థర్డ్ పార్టీ యాప్స్ మాత్రం కాల్ రికార్డింగ్ ఏపీఐని వినియోగించుకుని కాల్స్‌ను రికార్డ్ చేస్తున్నాయి.
తాజాగా ఈ ఏపీఐ సపోర్ట్‌ను గూగుల్
ఉపసంహరించుకుంటోంది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ ఏవీ కాల్స్‌ను రికార్డ్ చేయలేవు.
ఒకవేళ మీ ఫోన్ తయారు చేసిన కంపెనీ సొంతంగా రికార్డింగ్ సదుపాయం కల్పిస్తుంటే
మాత్రం యథాతథంగా కాల్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌లో కాల్ రికార్డింగ్
ఫీచర్ లేకపోతే మాత్రం ఇకపై గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్‌ను
డౌన్‌లోడ్ చేసుకోవడం ఇకపై కుదరదు.
0 Komentar