Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు

◼◼◼◼◼◼◼◼◼◼

1. సందేహం:

SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??

సమాధానం:

DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.

◼◼◼◼◼◼◼◼◼◼

2. సందేహం:

మహిళా టీచర్ భర్త నిరుద్యోగి. అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు. అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు. మెడికల్ రీయింబర్సుమెంట్ వర్తిస్తుందా?

సమాధానం:

APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ, నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.

◼◼◼◼◼◼◼◼◼◼

3. సందేహం:

ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా?

సమాధానం:

చేర్చకూడదు. అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

◼◼◼◼◼◼◼◼◼◼

4. సందేహం:

నా భార్య హౌస్ వైఫ్. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా? 

సమాధానం:

◼◼◼◼◼◼◼◼◼◼

జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.

5. సందేహం:

మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా?

సమాధానం:

చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు. అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాలెంటరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.

◼◼◼◼◼◼◼◼◼◼

Previous
Next Post »
0 Komentar

Google Tags