ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు
━━━━━━━━━━━━━━━━
1. సందేహం:
నేను HM గా పనిచేస్తున్నాను. అనారోగ్య కారణాల చేత SA గా
రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. పరిస్థితి ఏమిటి??
✅సమాధానం:
FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ
లీన్ కొనసాగుతుంది. కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు. ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి. SA క్యాడర్ లో తదుపరి
AAS కి అర్హత ఉండదు.
━━━━━━━━━━━━━━━━
2. సందేహం:
నాకు వినికిడి లోపం 70
శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు
లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..???
✅సమాధానం:
మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు
అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది. GO
MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత
వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి
వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్
ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.
GO MS No:262, Dt:25-8-1980.
━━━━━━━━━━━━━━━━
3. సందేహం:
సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న
తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే
ఎక్కువ వేతనం పొందుతున్నాడు. ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా??
✅సమాధానం:
వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు
ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.
━━━━━━━━━━━━━━━━
4. సందేహం:
నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన
అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను. నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా??
✅సమాధానం:
అవకాశం లేదు.
━━━━━━━━━━━━━━━━
5. సందేహం:
నా భార్య CPS ఉద్యోగి. ఆమె మరణించారు. ఇపుడు నేను ఏమి చేయాలి??
✅సమాధానం:
CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి. సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి. వీరు వాటిని PRA ముంబై కి
పంపాలి. వారు పరిశీలించి, మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.
0 Komentar