HURL Recruitment 2022 – 179 Executive,
Manager Posts – Details Here
హెచ్ యూఆర్ఎల్ లో 179 ఎగ్జిక్యూటివ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
ఐఓసీఎల్, ఎన్టీపీసీ,
కోల్ ఇండియా, ఎఫెసీఐఎల్, హెచ్ఎఫ్ సీఎల్ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్
లిమిటెడ్ (హెచ్ యూ ఆర్ఎల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 179
విభాగాలు: మార్కెటింగ్, సేఫ్టీ,
ఫైర్, ఇనుస్టుమెంటేషన్, ఎలక్ట్రికల్,
మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితరాలు.
పోస్టులు: చీఫ్ మేనేజర్, మేనేజర్,
అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్, కంపెనీ సెక్రటరీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ,
ఎంబీఏ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో
అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35
నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి
ఏడాదికి రూ.8.5 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
టెస్ట్,
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 26.04.2022.
దరఖాస్తులకు చివరి తేది: 11.05.2022.
0 Komentar