India's First Case of Coronavirus
Variant XE Reported from Mumbai
భారత్‌లో ‘ఎక్స్‌ఈ’ వేరియంట్ - ముంబయిలో తొలికేసు నమోదు
కొవిడ్ ఉద్ధృతి ప్రపంచ వ్యాప్తంగా
తగ్గుతోందని అనుకుంటున్న వేళ కొత్తరకం వేరియంట్‌లు కలవరపెడుతున్నాయి. ఇటీవల
బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం వేరియంట్ ‘ఎక్స్‌ఈ’ భారత్‌లోనూ బయటపడింది.
తొలికేసు ముంబయిలో నమోదైనట్లు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (BMC) వెల్లడించింది. దీనితో పాటు మరో కప్పా వేరియంట్ కూడా నమోదైనట్లు
తెలిపింది. అయితే, ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుల్లో
ఇప్పటివరకు తీవ్ర లక్షణాలేవీ లేవని బీఎంసీ పేర్కొంది.
సాధారణ కొవిడ్ పరీక్షల్లో భాగంగా
ముంబయికి చెందిన 230 మంది బాధితుల నమూనాలకు జీనోమ్
సీక్వెన్సింగ్ చేపట్టారు. వీటిలో 228 మందిలో ఒమిక్రాన్
వేరియంట్ నిర్ధారణ కాగా.. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్‌ఈ
బయటపడినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. మొత్తం 230 మందిలో
21మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా,
వీరిలో ఎవరికీ ఆక్సిజన్ అవసరం రాలేదన్నారు. ఆస్పత్రిలో చేరిన
బాధితుల్లో 12 మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని తెలిపారు.
ఇదిలాఉంటే, ఒమిక్రాన్
ఉపరకాలైన బీఏ.1, బీఏ.2 ల మిశ్రమం
ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఈ వేరియంట్, అధిక
సాంక్రమికశక్తి కలిగివున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టమైన ఆధారాలు
లేనప్పటికీ ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే దాదాపు 10శాతం ఎక్కువ వ్యాపించే గుణం ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా
వేస్తున్నారు. తాజాగా ఇది భారత్‌లోకి ప్రవేశించడంతో మరోసారి అప్రమత్తం కావాల్సిన
పరిస్థితి ఏర్పడింది.
0 Komentar